Dhanush: మామూలుగా బాలీవుడ్ స్టార్లకే హాలీవుడ్ వరకు వెళ్లేంత ఛాన్స్ ఉంటుంది అని చాలామంది ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఎందుకంటే బాలీవుడ్ నుండి హాలీవుడ్‌కు వెళ్లిన పలువురు స్టార్లు అక్కడ కూడా తమకంటూ ఒక ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు. అలాంటి రూల్‌ను బ్రేక్ చేస్తూ ఒక సౌత్ స్టార్ కూడా హాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. అతడే ధనుష్. తను ఇప్పటికీ ఇంగ్లీష్‌లో రెండు సినిమాలు చేసి అసలైన పాన్ వరల్డ్ స్టార్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం తను తెలుగు, తమిళ చిత్రాల్లనే బిజీ అయినా అప్పుడప్పుడు హిందీ చిత్రాల్లో కూడా నటిస్తూ అలరిస్తున్నాడు. తాజాగా ధనుష్ అప్‌కమింగ్ హాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
చాలాకాలం తర్వాత
‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఫకీర్’ అనే మూవీతో హాలీవుడ్‌లో డెబ్యూ చేశాడు ధనుష్. ఆ మూవీలో ధనుష్ యాక్టింగ్‌కు ఇంగ్లీష్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఆంటోనీ, జో రుస్సో దర్శకత్వం వహించిన ‘ది గ్రే మ్యాన్’లో నటించాడు. అందులో ఇద్దరు స్టార్లతో కలిసి అలరించాడు ధనుష్. కానీ ఆ సినిమా చూసిన ఇండియన్ ఆడియన్స్ మాత్రం ధనుష్ పాత్ర ఇంకాసేపు ఉంటే బాగుండేది అని ఫీలయ్యారు. అప్పటినుండి ఇప్పటివరకు ధనుష్ మరొక ఇంగ్లీష్ ప్రాజెక్ట్‌ను ఓకే చేయలేదు. ఇప్పుడు మొత్తంగా తెలుగు, తమిళ, హిందీ సినిమాపైనే దృష్టిపెట్టాడు. ఇంతకాలం తర్వాత ధనుష్.. ఒక హాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీతో కలిసి సినిమా చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: పోలీస్‌గా వరుణ్ ధావన్ ఉగ్రరూపం.. అదేంటి ‘జవాన్’ను మళ్లీ చూసినట్టుంది!
బోల్డ్ హీరోయిన్
సోనీ పిక్చర్స్ నిర్మాణంలో ఒక సినిమా చేయడానికి ధనుష్ సైన్ చేశాడని సమాచారం. ఈ సినిమాకు ‘స్ట్రీట్ ఫైటర్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. అంతే కాకుండా ఇందులో ధనుష్‌కు జోడీగా నటించడానికి సిడ్నీ స్వీనిని ఫిక్స్ చేశారట మేకర్స్. దీంతో ధనుష్, సిడ్నీ స్వీని కాంబినేషన్ గురించి వింటుంటేనే ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఇప్పటికీ హాలీవుడ్‌లో స్వీనికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏ సినిమా అయినా, ఎలాంటి పాత్ర అయినా, బోల్డ్‌గా నటించడానికి అయినా తను వెనకాడదు. అలా హాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిపోయిన స్వీని.. ఇప్పుడు ధనుష్‌తో కలిసి సినిమా చేయడానికి సిద్ధమవుతోందని విషయం హాట్ టాపిక్‌గా మారింది.
ధనుష్ బిజీ
ప్రస్తుతం ధనుష్ (Dhanush), సిడ్నీ స్వీని (Sydney Sweeney) ఎవరి ప్రాజెక్ట్స్‌లో వారు బిజీగా ఉన్నారు. అందుకే ‘స్ట్రీట్ ఫైటర్’ మూవీ ప్రారంభం కావాలంటే చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. ధనుష్ ప్రస్తుతం ‘ఇడ్లీ కడయ్’ అనే మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించడంతో పాటు తనే దీనిని డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కుబేర’ షూటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు. వీటితో పాటు ఇళయరాజా బయోపిక్‌లో కూడా ధనుషే హీరో. అలాంటి ధనుష్, సిడ్నీ స్వీని పెయిర్ తెరపై ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.