E-Paper
Advertisement

Electricity Rules: ఇకపై రాష్ట్రంలో కొత్తగా విద్యుత్ కనెక్షన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్..?

Electricity Rules: ఇకపై రాష్ట్రంలో కొత్తగా విద్యుత్ కనెక్షన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్..?
Advertisement

Electricity Rules: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో కొత్త విద్యుత్ కనెక్షన్లు పొందాలనుకునే వినియోగదారులకు తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(టీజీఈఆర్సీ) శుభవార్త చెప్పింది. ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై, విద్యుత్ లైన్ వేయడానికి పట్టే దూరాన్ని బట్టి కాకుండా, వినియోగదారుడు తీసుకునే లోడ్ ఆధారంగానే సర్వీస్ లైన్ చార్జీలు వసూలు చేయనున్నారు. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను నోటిఫై చేశారు. కొత్త నిబంధనల ప్రకారంలో-టెన్షన్(ఎల్టీ) కనెక్షన్లకు సంబంధించి నిర్ణీత ప్రామాణిక చార్జీలు అమలులోకి రానున్నాయి.

20 కిలోవాట్ల కంటే ఎక్కువ..

20 కిలోవాట్ల వరకు లోడ్ ఉన్న వ్యక్తిగత కనెక్షన్లు, లేదా 20 కిలోవాట్ల వరకు కలిపి లోడ్ ఉన్న అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలకు అవసరమైన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను సరఫరా చేసి, ఏర్పాటు చేసి, నిర్వహించాల్సిన బాధ్యత పూర్తిగా డిస్కంలదేనని టీజీఈఆర్సీ స్పష్టంచేసింది. వాటి ఖర్చులను వినియోగదారుల నుంచి వసూలు చేయొద్దని నొక్కిచెప్పింది. అయితే 20 కిలోవాట్ల కంటే ఎక్కువ లోడ్ ఉన్న అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలకు ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తే, దాని పూర్తి ఖర్చును వినియోగదారులే భరించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ మార్గదర్శకాలు గురువారం నుంచి అమలవ్వనున్నాయి.

Advertisement

Also Read: Mega 158: చిరు మూవీలో దురంధర్ బ్యూటీ.. విలన్ గా బాలీవుడ్ నిర్మాత..?

గృహ వినియోగదారుల కొత్త సర్వీస్ లైన్ చార్జీలు

లోడ్ సర్వీస్ లైన్ చార్జీలు
1 కిలోవాట్ వరకు రూ.500
1 కిలోవాట్-5 కిలోవాట్ రూ.500+ప్రతి కిలోవాట్ పై రూ.600 అదనం
5 కిలోవాట్-20 కిలోవాట్ రూ.2,900+ప్రతి కిలోవాట్ పై రూ.1,500 అదనం
20 కిలోవాట్, ఆపైన రూ.10,000 ప్రతి కిలోవాట్

లోడ్ ఆధారంగా స్థిర చార్జీలు

Advertisement

ఇదిలా ఉండగా ఇతర కేటగిరీలైన ఎల్టీ-II, III, IV, V, IX పరిధిలోకి గృహేతర, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయం, ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు వస్తాయి. ఇలాంటి లో-టెన్షన్ కేటగిరీలకు సైతం లోడ్ ఆధారంగా స్థిర చార్జీలను నిర్ణయించారు. ఉదాహరణకు, వ్యవసాయ కనెక్షన్లకు ప్రతి కిలోవాట్ కు రూ.1,000 చొప్పున వసూలు చేస్తారు. కానీ రైతుల నుండి ఎటువంటి ఓఆర్సీ వసూలు చేయరని టీజీఈఆర్సీ స్పష్​టంచేసింది. ఈ మార్పులు గృహ వినియోగదారులకు, రైతులకు ఉపశమనాన్ని కలిగించనున్నాయి.

Also Read: MP KiranKumar Reddy: టిల్లు.. చిల్లర మాటలొద్దు, గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకే తెలుస్తుందన్న ఎంపీ కిరణ్

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×