BigTV English

Tharun chug : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఆ ముగ్గురు సీఎంలపై తరుణ్ చుగ్ సంచలన కామెంట్స్..

Tharun chug : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఆ ముగ్గురు సీఎంలపై తరుణ్ చుగ్ సంచలన కామెంట్స్..

Tharun chug : ఢిల్లీ మద్యం కుంభకోణంపై తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఈడీ ఛార్జ్‌షీట్‌లో కవిత పేరు ఉండటంపై బీజేపీ-బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లిక్కర్ స్కాంలో ఉన్నారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు తరహాలోనే తెలంగాణ, పంజాబ్ లిక్కర్ పాలసీ పైనా విచారణ జరగాలన్నారు.


కేసీఆర్ దోచుకున్న డబ్బు బయటపడకుండా ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చారని ఆరోపించారు. తెలంగాణలో మొదలైన దోపిడీ ఇప్పుడు దేశ రాజధానికి చేరిందని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కేసీఆర్ మౌనం ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు. కుటుంబ రాజకీయాలు, అహంకారం, అవినీతి పాలన బీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్య పథకాలని తరుణ్ చుగ్ విమర్శించారు. లిక్కర్ స్కామ్ చార్జిషీట్‌లో కవిత పేరు 48 సార్లు ఈడీ ఎందుకు ప్రస్తావించిందో కేసీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

కవిత ఎందుకు ఫోన్లు మార్చారో ప్రజలకు చెప్పాలని తరుణ్ చుగ్ కోరారు. మాఫియా తరహాలో ఫోన్లను ధ్వంసం చేశారని మండిపడ్డారు. సమీర్ మహేంద్రుతో కవితకు ఉన్న సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. కుటుంబ వాదంతో తెలంగాణను దోపిడీ చేసిన కేసీఆర్.. ఈ ప్రణాళికలో అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌ను కలిశారని తరుణ్ చుగ్ ఆరోపించారు. కుంభకోణంలో ఉన్న వారంతా, కవిత ఇంటికి ఎందుకు వచ్చారని నిలదీశారు. ఒబెరాయ్ హోటల్లో జరిగిన సమావేశం ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. పంజాబ్ రైతులకు చెక్కులు ఇవ్వడం వెనుక కూడా లిక్కర్ కుంభకోణం ఉందని తరుణ్ చుగ్ అన్నారు.


రాజగోపాల్ Vs కవిత..
మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కవిత మధ్య ట్విటర్ వార్ నడిచింది. ఢిల్లీ మద్యం కేసులో తాజా ఛార్జ్‌షీట్‌లో కవిత పేరును ఈడీ చేర్చిన నేపథ్యంలో రాజగోపాల్‌ రెడ్డి ఆమెను ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్వీట్‌ చేశారు. దీనిపై కవిత గట్టిగా బదులిచ్చారు. రాజగోపాల్ అన్న.. తొందర పడకు.. మాట జారకు. 28 సార్లు తన పేరు చెప్పించినా.. 28 వేల సార్లు చెప్పించినా.. అబద్ధం నిజం కాదు. ట్రూత్‌ విల్‌ ప్రివెయిల్‌ అని కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని.. తన నిబద్ధతను కాలమే నిరూపిస్తుందని వ్యాఖ్యానించారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×