E-Paper
Advertisement

TG : మంత్రులకు ఆ పవర్ కట్?

TG : మంత్రులకు ఆ పవర్ కట్?
Advertisement

రాష్ట్ర మంత్రులకు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇంతకాలం వారికి ఉన్న కొన్ని పవర్స్‌ను కట్ చేసింది. ఎందుకంటే అవినీతి, అక్రమాలను నివారించేందుకే అని సర్కారు క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ మంత్రులకు కట్ చేసిన పవర్ ఏంటి? అని కొందరు నేతలు ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. అదేంటంటే, సీఎంఆర్ఎఫ్ అమలులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం సహాయ నిధి అమలులో ఇకపై మంత్రుల పాత్రను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మంత్రులు ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల ప్రజలకు సీఎంఆర్ఎఫ్ సిఫార్సులు ఇచ్చేవారు.కానీ, ఇక నుంచి మంత్రులు సైతం వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం వెల్లడించింది.

సెగ్మెంటుకే పవర్ పరిమితం..

సీఎంఆర్ఎఫ్ చెక్ పవర్‌ను నియోజకవర్గానికే పరిమితం చేయడం వలన పారదర్శకత నెలకొంటుందని సర్కారు భావిస్తున్నది.అందుకు సదరు మంత్రి ఏ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారో.. అక్కడి ప్రజలకు మాత్రమే సీఎంఆర్ఎఫ్ ప్రయోజనం అందనుంది.ఇప్పటి నుంచి ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గానికి చెందిన చిరునామా ఉన్న అభ్యర్థులకు మాత్రమే సీఎంఆర్ఎఫ్ టోకెన్ చేయాలని ప్రభుత్వం సూచించింది. అంతేకాకుండా ఇక పైనుంచి దరఖాస్తులను సైతం పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. దరఖాస్తుదారులు తమ వివరాలు, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. చెక్కుల జారీ, రీవాలిడేషన్ ప్రక్రియ కూడా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుంది.

ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు..

Advertisement

సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇకపై సీఎంఆర్ఎఫ్ సహాయం పొందాలంటే దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుంది. దీనికోసంప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది.ఇంతకుముందు సీఎంఆర్ఎఫ్ చెక్కులో మార్పులు అవసరమైతే మాన్యువల్ విధానం ఉండేది. ప్రస్తుతం ఆ ప్రక్రియను మార్చి సీఎంఆర్ఎఫ్ చెక్ రీ వాలిడేషన్ ప్రాసెస్‌ను ప్రజాప్రతినిధుల లాగిన్‌లో చేర్చారు. చెక్కులో మార్పులు కోరుకునే వారు ఇక నుంచి సంబంధిత స్థానిక ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.ప్రజాప్రతినిధి కార్యాలయ సిబ్బంది అసలు దరఖాస్తును సెక్రెటేరియట్‌లోని సీఎంఆర్ఎఫ్ విభాగానికి పంపించాలి. కొత్త చెక్కు సంబంధిత ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందికే అందిస్తారు.

రఘురామ కృష్ణరాజుకు ఢిల్లీ కోర్టులో ఊరట.. బ్యాంకు రుణాల కేసులో బెయిల్ మంజూరు
ఈ విధానం ద్వారా పారదర్శకత పెరుగుతుంది. దరఖాస్తు ఆమోదం పొందిన తరువాత మాత్రమే చెక్కులు జారీ చేస్తారు.అవసరమైన వివరాలు, పత్రాలు సరిచూసిన తరువాతే చెల్లింపులు జరుగుతాయి. ఇక గడువు ముగిసిన చెక్కుల రీవాలిడేషన్ కూడా ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుంది. గతంలో నకిలీ మెడికల్ బిల్లులు, మధ్యవర్తుల ద్వారా జరిగిన దుర్వినియోగం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఈ మేరకు కఠిన చర్యలు చేపట్టింది. భవిష్యత్‌లో ప్రజలు నేరుగా అధికారిక మార్గాల ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలని సూచించింది.దరఖాస్తులకు ఎమ్మెల్యేలు లేదా అధికార ప్రతినిధుల సిఫార్సు తప్పనిసరి.ప్రతీ దరఖాస్తును వైద్య నిపుణుల బృందం పరిశీలించిన తరువాతే ఆమోదం ఇవ్వనున్నారు.దరఖాస్తుదారులు సరైన పత్రాలు సమర్పించి అధికారిక మార్గాలను మాత్రమే అనుసరించాలని సూచించారు.

Advertisement

 

 

 

 

 

 

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×