Nara Lokesh: పాఠశాలలలో పిల్లల స్టడీ విషయంలో అంతంత మాత్రంగా ఉందని.. చెప్పిన మాట వినడం లేదని.. స్టూడెంట్స్ ను దండించకుండా.. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ చింత రమణ గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. స్టూడెంట్స్ ను దండించకుండా అర్థం చేసుకునేలా స్వీయ క్రమశిక్షణ చర్య ఆలోచన బాగుంది అంటూ హెడ్ మాస్టర్ ను మంత్రి నారా లోకేష్ అభినందించారు.
వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో ఈ రోజు విజయనగరం జిల్లాకు చెందిన హెడ్ మాస్టర్ వీడియో ఫుల్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. స్కూల్ లో చదువు విషయంలో పిల్లల పురోగతి అంతంత మాత్రంగా ఉండడంతో విద్యార్థులకు దండం పెట్టి, సాష్టాంగ పడి, అనంతరం గుంజీలు తీసిన హెడ్ మాస్టర్ సంఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.
మంత్రి లోకేష్ ఏమన్నారంటే..
ఏమన్నారంటే.. ‘విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్‌మాస్టర్ చింత రమణ గారు పిల్లల చదువుకు సంబంధించి పురోగతి అంతంతమాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని.. విద్యార్థులను దండించకుండా, గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. హెడ్‌మాస్టర్ గారూ! అంతా కలిసి పనిచేసి, ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. వారిని దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయక్రమశిక్షణ చర్యల ఆలోచన బాగుంది, అభినందనలు. అందరం కలిసి విద్యా ప్రమాణాలు పెంచుదాం. పిల్లల విద్య, శారీరక, మానసిక వికాసానికి కృషిచేసి, వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేద్దాం’ అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. హెడ్‌మాస్టర్ స్వీయక్రమశిక్షణ చర్యల ఆలోచన బాగుందని అభినందించారు.
హెడ్ మాస్టర్ ఆవేదన ఇదే..
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంటలో జెడ్పీ హైస్కూల్ లో అక్కడ స్టూడెంట్స్ ఇవాళ స్కూల్‌కు రాగానే ప్రార్థన కార్యక్రమం నిర్వహించారు. అయితే అక్కడికి వచ్చిన హెడ్‌మాస్టార్ విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. విద్యార్థుల్ని దండించలేమని, తిట్టిలేమని.. వారిని ఏమీ చేయలేమని హెడ్ మాస్టర్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో పిల్లల ముందు చేతకాని వారిలా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్‌మాస్టర్ చింత రమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంతమాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని….విద్యార్థులను దండించకుండా, గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. హెడ్మాస్టరు గారూ!… pic.twitter.com/Se7zu6uwf5
— Lokesh Nara (@naralokesh) March 13, 2025
తప్పు ఎవరిది..? విద్యార్థులదా, టీచర్లదా.. తల్లిదండ్రులదా..? అంటూ ఆవేదనలో ఆయన విద్యార్థులకు సాష్టాంగ నమస్కారం పెట్టి దండం పెట్టారు. ఆ తర్వాత హెడ్ మాస్టర్ గుంజీలు సైతం తీశారు. తమకు వీలైనంతవరకు ప్రయత్నాలు చేస్తున్నామని.. పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతే స్కూల్‌కు రావడం వృథా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల్ని కొట్టినా, తిట్టినా తిరిగి టీచర్లపైనే ఫిర్యాదులు చేస్తున్నారని.. అందుకే దండంచుకుండా.. ఇలా చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి లోకేష్ కూడా స్పందించారు.
ALSO READ: BANK OF BARODA: గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడగింపు