BigTV English

Mukesh Gowda: బిగ్ బాస్ కు గుప్పెడంత మనసు హీరో రిషి..

Mukesh Gowda: బిగ్ బాస్ కు గుప్పెడంత మనసు హీరో రిషి..

Mukesh Gowda: ప్రస్తుతం సినిమాల ద్వారా హీరోలు ఎంత పేరు తెచ్చుకుంటున్నారో తెలియదు కానీ, సినిమా హీరోలకంటే ఎక్కువగా మాత్రం సీరియల్ హీరోస్ పేరు తెచ్చుకుంటున్నారు. వాళ్లకు కూడా అభిమాన సంఘాలు తయారవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే సీరియల్ హీరోస్ మధ్య కూడా ఫ్యాన్ వార్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.


కన్నడ నటుడు ముకేశ్ గౌడ. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగువారికి పరిచయమయ్యాడు. ఈ సీరియల్ అతని జీవితాన్నే మార్చేసింది అని చెప్పాలి. రిషేంద్ర భూషణ్ అనే పాత్రలో అతడి నటనకు తెలుగు అభిమానులు ఫిదా అయిపోయారు. ముకేశ్ అని కాకుండా రిషి అనే పిలవడం మొదలుపెట్టారు. అసలు ఎంతలా రిషికి ఫ్యాన్స్ ఎడిక్ట్ అయ్యారంటే.. అతను కొన్ని రోజులు సీరియల్ లో కనిపించకపోయేసరికి సోషల్ మీడియాలో రిషిని తీసుకురండి అని గుప్పెడంత మనసు డైరెక్టర్ పై ఫైర్ అయ్యారు కూడా.

ఇక ఫ్యాన్స్ కోపాన్ని తట్టుకోలేని సీరియల్ యాజమాన్యం మళ్లీ రిషిని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎంతో ఉత్కంఠగా నడుస్తున్న ఈ సీరియల్ త్వరలోనే ఎండ్ కానుంది. ఇది గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులకు పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఇకపోతే త్వరగా సీరియల్ కు ముగించడానికి కారణం.. ముకేశ్ కు బిగ్ బాస్ ఆఫర్ రావడమే అని తెలుస్తోంది. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా తెలిపాడు.


త్వరలోనే కన్నడలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 11 లో ముకేశ్ పాల్గొననున్నట్టు తెలిపాడు. కన్నడ బిగ్ బాస్ కు మొదటినుంచి ఈగ విలన్ సుదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఈసారి సుదీప్ కాకుండా రిషబ్ శెట్టి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో తెలుగువారికి సుపరిచితుడైన ముకేశ్ కంటెస్టెంట్ గా వెళ్తుంటే.. తెలుగు అభిమానులు కూడా ఆయనకు సపోర్ట్ గా నిలబడతారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ సీజన్ లో ముకేశ్ విన్నర్ గా నిలుస్తాడో .. లేదో తెలియాల్సి ఉంది.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×