PT Usha blames Vinesh Phogat, says onus on player and coaches to make weight: వినేశ్ ఫోగట్ తనకు జరిగిన అన్యాయంపై న్యాయం కోసం పోరాడుతోంది. ఒకవైపు ఆ తీర్పుని రిజర్వ్ చేశారు. 13వ తేదీని తుది తీర్పు ప్రకటిస్తామని తెలిపారు. ఇంతలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉష తగుదునమ్మా అంటూ సీన్ లోకి వచ్చి, నోటికొచ్చినట్టు మాట్లాడింది. దీంతో ఈమె మాటలు ఏమైనా తీర్పుపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయా? అని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరి పని వాళ్లు చేయకుండా, పేనుకు పెత్తనం ఇస్తే, జుత్తంతా గొరికిందన్నట్టు పీటీ ఉషకు పెద్ద బాధ్యతలు అప్పగిస్తే, మన క్రీడాకారుల వైపు మాట్లాడాల్సింది పోయి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏమిటి? అని మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇలాగేనా మాట్లాడాల్సింది. ఒక బాధ్యతగల పదవిలో ఉండి, తనిలా మాట్లాడటం సరైంది కాదని అంటున్నారు.
ఇంతకీ పీటీ ఉష ఏమన్నాదంటే.. రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్, జూడోలాంటి వాటిలో తన బరువు నియంత్రణలో ఉంచుకునే బాధ్యత మొత్తం అథ్లెట్ దే అవుతుందని, అది చూడాల్సిన బాధ్యత కోచ్ పై ఉందని ఆమె అనడం గమనార్హం.
ఇదే మాటలు తీర్పు చెప్పేవారు వింటే, పరిస్థితి ఎలా ఉంటుందని నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.
ఇంకా తనేమన్నాదంటే.. అందరూ ఇండియన్ ఒలింపిక్ మెడికల్ టీమ్ ని నిందిస్తున్నారు. వారు ఆటగాళ్లకు గాయాలైతే కట్లు కడతారు కానీ, అందరి బరువు చూసి, వారికి గైడ్ చేయరని తెలిపింది. 117 మంది ఆటగాళ్ల బరువు చూడటం వారి బాధ్యత కాదని తెలిపింది. ఆ బాధ్యత సంబంధిత కోచ్, ఆ అథ్లెట్ సపోర్ట్ టీమ్ దేనని కుండ బద్దలు కొట్టినట్టు తెలిపింది.
Also Read: వినేశ్ విషయంలో.. న్యాయం గెలుస్తుందా?
ఐఓఏ మెడికల్ టీమ్, ముఖ్యంగా డాక్టర్ పర్డీవాలాను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న విమర్శలు సరికావు. వీటిని ఖండిస్తున్నాను” అని పీటీ ఉష స్పష్టం చేసింది. నువ్వు ఖండిస్తే ఖండించావు నిన్నెవరూ ఖండించవద్దని అనలేదు కదా.. అదేదో తీర్పు చెప్పాక చెబితే బాగుండేది కదా.. అని నెటిజన్లు పీటీ ఉషపై అంతెత్తున లేస్తున్నారు. భారతదేశమంతా మన రెజ్లర్ కి అన్యాయం జరిగిందంటే.. నువ్వు ఒక్కరు మాత్రం వెరైటీగా మాట్లాడుతున్నావని మండిపడుతున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే.