Big Stories

Telangana : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ విడుదల.. కార్యక్రమాలివే..!

Telangana today news : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుంచి 22 వరకు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. 21 రోజులపాటు జరిగే ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్‌ను తాజాగా సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. రోజువారీగా చేపట్టే కార్యక్రమాల వివరాలను ప్రకటించారు. చేయాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్సు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.

- Advertisement -

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభిస్తారు. జూన్ 2న హైదరాబాద్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. ఆ తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. దశాబ్ది ఉత్సవ సందేశాన్ని కేసీఆర్ ఇస్తారు. అదే రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం, దశాబ్ది ఉత్సవ కార్యక్రమాలు జరుగుతాయి.

- Advertisement -

జూన్ 3న తెలంగాణ రైతు దినోత్సవం
జూన్ 4న పోలీసుశాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం
జూన్ 5న తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం
జూన్ 6న తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం
జూన్ 7న సాగునీటి దినోత్సవం
జూన్ 8న ఊరూరా చెరువుల పండుగ
జూన్ 9 తెలంగాణ సంక్షేమ సంబురాలు
జూన్ 10న తెలంగాణ సుపరిపాలన దినోత్సవం
జూన్ 11న తెలంగాణ సాహిత్య దినోత్సవం
జూన్‌ 12న తెలంగాణ రన్‌
జూన్ 13న తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం
జూన్ 14న తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం
జూన్ 15న తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం
జూన్ 16న తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం
జూన్ 17న తెలంగాణ గిరిజనోత్సవం
జూన్ 18న తెలంగాణ మంచి నీళ్ల పండుగ
జూన్ 19న తెలంగాణ హరితోత్సవం
జూన్ 20న తెలంగాణ విద్యాదినోత్సవం
జూన్ 21న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం
జూన్ 22న అమరుల సంస్మరణ కార్యక్రమం

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News