BigTV English

Astronauts Butch Wilmore Sunita Williams : ఎనిమిది నెలలుగా అంతరిక్షంలోనే సునితా విలియమ్స్.. భూమిపైకి వచ్చేందుకు ముహూర్తం ఫిక్స్

Astronauts Butch Wilmore Sunita Williams : ఎనిమిది నెలలుగా అంతరిక్షంలోనే సునితా విలియమ్స్.. భూమిపైకి వచ్చేందుకు ముహూర్తం ఫిక్స్

Astronauts Butch Wilmore Sunita Williams : దాదాపు ఎనిమిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్ లను తిరిగి భూమి మీదకు తీసుకువచ్చేందుకు నాసా తేదీని ఫిక్స్ చేసింది. వీరిద్దరు ఎనిమిది రోజుల మిషన్ కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి చేరుకున్న సంగతి తెలిసిందే. వీరిని తీసుకువచ్చేందుకు నిర్ణయించి స్పేస్ మిషన్ ఫెయిల్ అవ్వడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. దాంతో.. ఎనిమిది నెలలుగా అక్కడే ఎదురుచూస్తున్నారు. అక్కడ వీరి కోసం సరైన ముందస్తు ఏర్పాట్లు లేకపోవడంతో వారి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుందనే ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ – నాసా, స్పేస్ – ఎక్స్ సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టు ద్వారా వచ్చే నెల మార్చి 12న తిరిగి తీసుకొచ్చేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో.. వీరి రిటర్న్ జర్నీకి సంబంధించిన ప్రాజెక్టుపై అంతటా ఆసక్తి నెలకొంది.


వారికి ఈ ఏడాది మధ్యనాటికి తీసుకొస్తామని గతంలో ప్రకటించిన నాసా.. అందుకు వేగంగా పని చేసింది. ఈ మిషన్ కోసం స్పేస్ ఏక్స్ సహాయం కూడా తీసుకోవడంతో.. వారిని తీసుకొచ్చే క్రూ-10 సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ వెహికిల్ చివరి దశ పరీక్షలు జరుగుతున్నట్లు తెలిపిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అధికారులు.. ఈ రిటర్న్ జర్నీలో సునితా విలియమ్స్, విల్మోర్ లతో పాటుగా నిక్ హేగ్, రోస్కోస్మోస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ అనే మరో ఇద్దరు నాసా వ్యోమగాములు సైతం భూమి మీదకు తిరిగి వస్తారని చెబుతున్నారు. వీరి రాకకోసం ఏర్పాటు చేసిన క్రూ-9 విఫలం కావడంతో.. వీరి తర్వాత స్పేస్ స్టేషన్ కి వెళ్లే వ్యోమగామల కోసం ఏర్పాటు చేసిన క్రూ-10 ద్వారా వీరు భూమి మీదకు రానున్నారు.

క్రూ-10 ప్రయోగానాన్ని మార్చి చివరి నాటికి చేపట్టాలని భావించిన అధికారులు.. అందులో నాసా కు చెందిన వ్యోమగాములు అన్నే మెక్ క్లెయిన్, నికోల్ అయర్స్.. జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీకి చెందిన టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ లను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు చేర్చనున్నారు. వీరిని అక్కడకు చేర్చి, అదే స్పేస్ క్రాఫ్ట్ లో సునితా, బుచ్ విల్మోర్ లను తీసుకురానున్నారు. ఈ బాధ్యతల్ని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ లో భాగంగా ఎలన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ నిర్మించిన క్రూ డ్రాగన్ లో తీసుకురానున్నారు. అంతకు ముందు.. బోయింగ్ తయారు చేసిన క్రూలో వారికి అక్కడకు పంపగా, అది విఫలమైన నేపథ్యంలో.. ఈసారి స్పేస్ ఏక్స్ స్పేస్ క్రాఫ్ట్ ను వినియోగిస్తున్నారు.


Also Read :  ఏఐ టెక్నాలజీతో ఉద్యోగాలు పోవు – మోదీ చెప్పిన లాజిక్ ఇదే

సునీతా విలియమ్స్, బుచ్ విలోర్మ్ గతేడాది జూన్ 6న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వారి అక్కడి చేరుకోగా.. నాసా ప్రణాళిక ప్రకారం అక్కడ ఎనిమిది రోజుల పాటు ఉండి, తిరిగి భూమి మీదకు వచ్చేయాలి. కానీ.. తిరుగు ప్రయాణం మొదలయ్యో సమయానికి స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సమస్యలు తలెత్తినట్లు శాస్త్రవేత్తలు గూర్తించారు. దాంతో.. వారి ప్రయాణాన్ని వాయిదా వేశారు. భూమి మీద నుంచి మరో స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగించి, వారిని తీసుకురావాలని అనుకున్నారు. కానీ.. ప్రాజెక్టు వాయిదా పడుతూ వస్తోంది. అత్యాధుని టెక్నాలజీ ఉన్న నాసా వారికి తీసుకురాకపోతే ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎట్టకేలకు వారి రాకకు నాసా ముహూర్తం ఫిక్స్ చేసింది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×