BigTV English

Vijay Varma: తమన్నాతో బ్రేకప్.. లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన విజయ్ వర్మ.. ఎన్ని కోట్లంటే?

Vijay Varma: తమన్నాతో బ్రేకప్.. లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన విజయ్ వర్మ.. ఎన్ని కోట్లంటే?

Vijay Varma: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma) అందరికీ సుపరిచితులే..కానీ ఈయనను తన నటన కంటే ఎక్కువగా తమన్నా (Tamannaah) బాయ్ ఫ్రెండ్ గానే అందరూ గుర్తు పెట్టుకున్నారు. అయితే అలాంటి విజయ్ వర్మ తాజాగా వార్తల్లో నిలిచారు. ముంబైలో సెలబ్రిటీలు ఉండే ఖరీదైన ఏరియాలో లగ్జరీ ఫ్లాట్ కొన్నారు. మరి ఇంతకీ విజయ్ వర్మ ఏ ఏరియాలో ఫ్లాట్ కొన్నారు.. దాని ఖరీదు ఎంత? అనేది ఇప్పుడు చూద్దాం.. విజయ్ వర్మ తెలుగువాడైనప్పటికీ బాలీవుడ్ లోనే రాణించారు. అలా బాలీవుడ్ లో నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ వర్మ తెలుగులో నాని (Nani) హీరోగా చేసిన ‘ఎంసీఏ’ మూవీలో నానిని ఢీ కొట్టే విలన్ విలన్ పాత్రలో చేశారు.ఈ సినిమాలో విలన్ పాత్రకి గానూ విజయ్ వర్మకి మంచి గుర్తింపు లభించింది.అయితే అలాంటి విజయ్ వర్మ తమన్నాతో ప్రేమలో ఉన్నారు అంటూ వీరి ప్రేమ విషయం బయట పెట్టకముందు ఎన్నో వార్తలు వినిపించాయి.


తమన్నా – విజయ్ వర్మ మధ్య బ్రేకప్ నిజమేనా..?

పైగా న్యూ ఇయర్ పార్టీలో వీరిద్దరూ కలిసి చిందులేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో తమన్నా కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ చాలామంది కామెంట్స్ చేశారు. చాలాసార్లు వీరి ప్రేమ గురించి క్లారిటీ ఇవ్వమని అడగగా క్లారిటీ ఇవ్వలేదు.ఆ తర్వాత ఇద్దరు స్వయంగా తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టారు. ఇక తమన్నా – విజయ్ వర్మ కలిసి లస్ట్ స్టోరీస్ -2 వెబ్ సిరీస్ లో చాలా సాహసం చేసి మరీ నటించారు.ఈ వెబ్ సిరీస్ లో వీరిద్దరి మధ్య ఉన్న సన్నివేశాలు చూసి చాలామంది ఫిదా అయ్యారు. అయితే చాలా రోజుల నుండి ఒకే ఫ్లాట్లో డేటింగ్ చేస్తున్న ఈ జంట సడన్ గా విడిపోతున్నట్టు బీటౌన్ లో వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే అటు విజయ్ వర్మతో పాటు ఇటు తమన్నా మాటలు అలాగే ఉండడంతో సడన్ గా వీరిద్దరూ ఎందుకు విడిపోయారని చాలామందిలో ఒక అనుమానం అయితే ఉండేది.అయితే తమన్నా పెళ్లి చేసుకుందాం అంటే విజయ్ వర్మ దూరం పెట్టారనే రూమర్ కూడా వినిపించింది.


బ్రేకప్ తర్వాత లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన విజయ్ వర్మ..

ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా ప్రియురాలితో బ్రేకప్ చెప్పిన విజయ్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎందుకంటే విజయ్ వర్మ తాజాగా ముంబైలోని ఖరీదైన ప్రాంతమైనటువంటి జుహూ ఏరియాలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ని కొనుగోలు చేశారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా ఫరాఖాన్ తన యూట్యూబ్ వ్లాగ్ లో బయటపెట్టింది. విజయ్ వర్మ ముంబైలోని జుహులో అరేబియా సముద్రం ఫేసింగ్ తో ఉన్నటువంటి ఒక కాస్ట్లీ లగ్జరీ అపార్ట్మెంట్ ని కొనుగోలు చేశారు. అయితే సెలబ్రిటీలు అందరూ ఉండే జుహు ఏరియాలో అపార్ట్మెంట్లు ఎంత ఖరీదైనవో చెప్పనక్కర్లేదు. ఈ లెక్కన విజయ్ వర్మ కొన్న అపార్ట్మెంట్ ధర ఏ లెవెల్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే తమన్నాతో బ్రేకప్ చెప్పుకున్న వేళ విజయ్ వర్మ ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేయడంతో మరోసారి బీ టౌన్ లో వార్తల్లో నిలిచారు.. ఇక విజయ్ వర్మ కొన్న అపార్ట్మెంట్ ని ఫరాఖాన్ తన యూట్యూబ్ వ్లాగ్ లో చూపించడంతో చాలా మంది సెలెబ్రేటీలు ఆయనకి విష్ చేస్తున్నారు. దీని ధర సుమారుగా రూ.70 నుంచి రూ.80 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

ALSO READ:Vishal – Dhansika: గాసిప్స్ అన్నీ నిజమే… హీరోయిన్ తో లవ్ పై ఓపెన్ అయిన విశాల్.. పెళ్లి డేట్ కూడా ఫిక్స్.!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×