BigTV English

RS Praveen Kumar Joined in BRS: నేడు బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. కేసీఆర్‌కు పుట్టావంటూ విశారదన్ ట్వీట్

RS Praveen Kumar Joined in BRS: నేడు బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. కేసీఆర్‌కు పుట్టావంటూ విశారదన్ ట్వీట్

RS Praveen Kumar


RS Praveen Kumar Joined BRS Party: బీఎస్పీ (బహుజన్ సమాజ్ పార్టీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మార్చి 16న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ – బీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న వేళ.. ఆయన బీఎస్పీకి రాజీనామా చేయడం ఆ పార్టీ నేతలకు షాకిచ్చినట్లైంది. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ నేపథ్యంలోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. కవిత అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ తో పొత్తును వ్యతిరేకించిన బీఎస్పీ హైకమాండ్.. ప్రెస్ మీట్ పెట్టి దానిపై మాట్లాడాలని చెప్పడంతోనే రాజీనామా చేశానని, తన దారిని మార్చుకోక తప్పడం లేదంటూ ట్వీట్ చేశారు.

ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలిపారు. నేడు కేసీఆర్ సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారెక్కనున్నారు. దీనిపై ధర్మ సమాజ్ పార్టీ చీఫ్ విశారదన్ మహారాజ్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RSP) కేసీఆర్ తో కలవడాన్ని యావత్ దేశమంతా వ్యతిరేకించి.. దుమ్మెత్తి పోసినా కూడా.. ఆయన ఇప్పుడు వెళ్లి ఏకంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాడంటే.. తాము ముందునుండీ చెబుతున్నట్లు ప్రవీణ్.. కేసీఆర్ కడుపులో నుంచి వచ్చాడన్న మాటను ఇప్పుడు నిర్థారించాడని ఘాటుగా ట్వీట్ చేశారు.


Also Read:హైదరాబాద్ లో మరో సారి రెచ్చిపోయిన చెడ్డీ గ్యాంగ్.. ఏకంగా రూ.7.8 లక్షలు చోరీ..!

కాగా.. బీఎస్పీకి రాజీనామా చేసినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. కవిత అరెస్ట్ పై తీవ్రంగా స్పందించారు. “బీఆర్ఎస్ – బీఎస్పీ పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. నిన్న బీయస్పీ- బీఆరెస్ పొత్తు వార్త బయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను. మళ్లీ చెబుతున్నా.. చివరి వరకు బహుజన వాదాన్ని నా గుండెలో పదిలంగా దాచుకుంటా” అని Xలో చేసిన ట్వీట్ లో రాసుకొచ్చారు.

Tags

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×