Big Stories

Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్.. !

Threatening Calls to MLA Raja Singh(Political news in telangana): గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి చంపుతామంటూ బెదిరిస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. గతంలో కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయన్నారు. అయితే, ఈ విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అయినా బాధ్యతాయుతమైన పౌరుడిగా ఈ పరిస్థితిని పోలీసులకు తాను తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, డీజీపీకి లేఖ రాశారు.

- Advertisement -

‘ఈరోజు నాకు వరుసగా బెదిరింపు కాల్స్ వచ్చాయి. పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ధర్మం కోసం నువ్వు పనిచేస్తే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. అంతేకాదు.. నా ఫ్యామిలీని కూడా చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఫిర్యాదు చేసినా.. అయినా పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఇప్పుడైనా వీటిపై చర్యలు తీసుకుంటారని ఫిర్యాదు చేశాను. నాకు ఈ బెదిరింపు కాల్స్ రావడం ఎప్పుడు బంద్ అవుతాయో చూద్దాం’ అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

- Advertisement -

Also Read: 1200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం..అందులో ఎవరెవరున్నారంటే ? : ప్రణీత్ రావు

కాగా, హైదరాబాద్ లో ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రజాభవన్ లో బాంబు పెట్టామంటూ ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. కాసేపట్లో ప్రజాభవన్ పేలిపోతుందంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు బాంబ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. అందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. ప్రజాభవన్ తోపాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాంటిదేమీ లేదని గుర్తించారు. కాగా, ఈ కేసులో పోలీసులు పురోగతిని సాధించినట్లు తెలుస్తోంది. 24 గంటల్లోనే నిందితుడిని ట్రేస్ చేసి అరెస్ట్ చేసినట్లుగా సమాచారం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News