BigTV English

Holidays: ఈ వారంలో మళ్లీ వరుసగా 3 రోజులు సెలవులు.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Holidays: ఈ వారంలో మళ్లీ వరుసగా 3 రోజులు సెలవులు.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Holidays: రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు, ఉద్యోగులకు ఇది శుభవార్త. మరోసారి వరుసగా మూడు సెలవులు రానున్నాయి. ఇటీవల ఈ నెలలోనే వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చిన విషయం తెలిసిందే. తాజా మరోసారి మూడు రోజులు సెలవులు వస్తుండడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫుల్ జోష్‌లో ఉన్నారు. మొన్న ఆగస్టు 8 నుంచి 10 వరు వరుసగా మూడు రోజులు హాలిడేస్ వచ్చాయి. ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం, ఆగస్టు 9న రాఖీ పౌర్ణమి, ఆగస్టు 10న సండే కావడంతో మూడు సెలవులు వచ్చాయి. తాజాగా ఈ వారంలో వరుసగా మరోసారి మూడురోజులు హాలిడేస్ వస్తున్నాయి.


ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా పబ్లిక్ హాలీడే ఉంటుంది. ఆగస్టు 16న కృష్ణాష్టమి పండుగ సందర్భంగా సెలవు ఉంది. ఈ పండుగను దేశ వ్యాప్తంగా సంబరంగా జరుపుకుంటారు. ఈ రోజు కూడా సెలవు ఉంటుంది. ఇక ఆగస్టు 17న ఆదివారం కావడంతో సాధారణ సెలవు ఎలాగూ ఉంటుంది. దీంతో వరుసగా మూడు రోజులు హాలిడేస్ వచ్చాయి.

ఆగస్టు 15: ఇండిపెండెన్స్ డే


ఈ మూడు రోజుల సెలవుల్లో భాగంగా ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే తో హాలిడేస్ ప్రారంభం అవుతున్నాయి. ఈ నేషనల్ హాలిడే రోజున దేశ వ్యాప్తంగా పాఠశాలల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. ఈ రోజు భారత దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. దీనిని విద్యార్థులు, ప్రజలు దేశభక్తితో జరుపుకుంటారు.

ఆగస్టు 16: కృష్ణాష్టమి

ఆగస్టు 16న కృష్ణాష్టమి సందర్భంగా సెలవు ఉంటుంది. శ్రీకృష్ణుని జన్మదినోత్సవంగా జరుపుకునే ఈ పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. హైదరాబాద్‌లో పలు చోట్ల ఆలయాల్లో రంగురంగుల ఉత్సవాలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. విద్యార్థులు ఈ రోజున కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో పాల్గొంటారు.

ALSO READ: EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

ఆగస్టు 17: వారాంతపు సెలవు

ఆగస్టు 17న ఆదివారం. ఈ రోజు సాధారణ సెలవు ఉంటుంది. విద్యార్థులకు ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.

ఈ నెల 27న వినాయక చవితి

ఆగస్టు నెలలో ఇటు విద్యార్థులకు, అటు బ్యాంకులకు చాలా సెలవులు వస్తున్నాయి. ఈ మాసంలో స్కూళ్లు కేవలం 18 నుంచి 20 రోజుల పాటు మాత్రం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 27న వినాయక చవితి పండగ కూడా ఉంది. ఆ రోజు కూడా సెలవు ఉంటుంది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు పిల్లలతో సరదాగా గడపనున్నారు. కొంతమంది సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

ALSO READ: Weather News: బంగాళఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ జిల్లాల్లో కుండపోత వర్షం

Related News

Weather Update: హై అలర్ట్..! నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ఛాన్స్..

CM Revanth Reddy: బతుకమ్మకుంటతో తొలి అడుగు.. కబ్జా కోరల్లో చిక్కిన ప్రతి చెరువును రక్షిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Hydra Commissioner: ఇది ఒక చారిత్రక ఘట్టం, ఇందులో నేను భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నా: హైడ్రా కమిషనర్

CM Revanth: తాట తీస్తాం.. సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

CM Revanth Reddy: అంబర్ పేట్‌లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు.. అనుమతి లేనిదే నో ఎంట్రీ

Hyderabad Crime Rate: హైదరాబాద్‌లో గణనీయంగా తగ్గిన క్రైమ్ రేట్.. పోలీసుల సమిష్టి కృషి ఫలితం

TGPSC Group 2: తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

Big Stories

×