BigTV English

Fire Accident : బిల్డింగ్ దట్టంగా పొగలు – ఓ చిన్నారి సహా ఇద్దరు మహిళలు మృతి

Fire Accident : బిల్డింగ్ దట్టంగా పొగలు – ఓ చిన్నారి సహా ఇద్దరు మహిళలు మృతి

Fire Accident : శుక్రవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాలగూడలో చోటుచేసుకున్న ఓ అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వీరంతా.. దట్టంగా పొగలు వ్యాపించడంతో ఊపిరాడక మృతి చెందినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఘటన విషయాలు తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది.. హుటాహుటిన మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు.


నార్శింగి పరిధిలోని పుప్పాలగూడలోని ఓ రెండు అంతస్తుల భవనంలో సాయంత్రం వేళ మంటలు చెలరేగాయి. బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగడంతో భవనం మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది. తొలుత భవనంలో మంటలు చెలరేగిన విషయం తెలుసుకున్న లంగర్‌ హౌస్‌ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దట్టంగా కమ్ముకున్న పొగల మధ్యలోనే భవనంలోకి వెళ్లిన సహాయక సిబ్బంది.. ముగ్గురిని బయటకు తీసుకువచ్చారు.

వీరిని మొదటి అంతస్తులోని ఓ గదిలో గుర్తించగా.. వారిలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. పొగను పీల్చడంతో వారంతా అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. దాంతో.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దట్టంగా అలుముకున్న పొగ మధ్యలో వారి ఆరోగ్య పరిస్థితి అప్పటికే క్షీణించినట్లుగా వైద్యులు గుర్తించారు.  కొంత సేపటికి ఆసుపత్రిలోనే ఇద్దరు మహిళలు, చిన్నారి ప్రాణాలొదిలారు.


ఈ ఘటనలో మృతి చెందిన వారికి సిజిరా(7), సహానా(40), జమీలా(70)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న మరో ఐదుగురిని సురక్షితంగా అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. మంటల ధాటికి భవనంలోని మూడు గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో.. ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

అయితే.. అసలు బిల్డింగ్ లోని గ్రౌండ్ ప్లోర్లో మంటలు ఎందుకు వ్యాపించాయి. ఎలా ప్రమాదం జరిగింది అనే విషయాలను మాత్రం గుర్తించలేదు. ఈ ప్రమాదం గురించి సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో సమాచారం వచ్చినట్లు చెబుతున్నఅగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బిల్డింగ్ లో మనుషులు చిక్కుకున్నారనే సమాచారంతో.. ల్యాడర్ ద్వారా పైకి వెళ్లిన సిబ్బంది.. తలుపులు పగులగొట్టి బాధితుల్ని కాపాడారు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×