Sonakshi Sinha: మామూలుగా హీరో, హీరోయిన్ల లైఫ్‌స్టైల్‌కు చాలా తేడా ఉంటుంది ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. ప్రేక్షకులతో పోలిస్తే సినీ సెలబ్రిటీల లైఫ్‌స్టైల్ చాలా డిఫరెంట్ అన్నది తెలిసిన విషయమే. కానీ కొందరు సినీ సెలబ్రిటీలు కూడా ఎన్నో ఆంక్షలతోనే జీవిస్తూ ఉంటారని అంటోంది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. దానికి తను తన జీవితాన్ని ఉదాహరణగా తీసుకుంది. మామూలుగా సినీ సెలబ్రిటీలు ఎప్పుడు నచ్చితే అప్పుడు ఇంటికి రావడం, నచ్చిన లైఫ్‌స్టైల్ మెయింటేయిన్ చేయడం లాంటివి తనకు జరగలేదంటూ, అసలు తన ఇంట్లో ఎంత స్ట్రిక్ట్‌గా ఉండేవారో బయటపెట్టింది సోనాక్షి సిన్హా. తను 32 ఏళ్లు వచ్చేవరకు ఇంట్లో తను ఎదుర్కున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.
ఇంట్లో కర్ఫ్యూ
‘‘నేను రాత్రి 1.30 గంటల లోపు ఇంటికి వచ్చేయాలని ఇంట్లో రూల్ ఉండేది. నేను 32 ఏళ్లు వచ్చేవరకు ఇదే రూల్ కంటిన్యూ అయ్యింది. కానీ జాహీర్‌కు ఈ రూల్‌తో ప్రాబ్లమ్ ఉండేది. నేను ఎప్పుడైనా ఈ రూల్ బ్రేక్ చేశానంటే అది తన కోసమే. రూల్ బ్రేక్ చేసినందుకు తర్వాత ఇంట్లోవారితో తిట్లు తినేదాన్ని. నేను రామాయణ అనే బిల్డింగ్‌లో ఉండేదాన్ని. నేను 10వ ఫ్లోర్‌లో ఉంటే అమ్మ, నాన్ని 5వ ఫ్లోర్‌లో ఉండేవారు. ఒక వ్యక్తి మాకు టెలిఫోన్ ఆపరేటర్‌గా ఉండేవారు. ఆయన కూడా చాలా స్ట్రిక్ట్. నా కారు బిల్డింగ్ లోపలికి వచ్చిన వెంటనే బేబి వచ్చింది అని మా అమ్మ నాన్నకు ఫోన్ చేసి చెప్పేవాడు. కొన్నిసార్లు మా అమ్మ నాన్నకు ఫోన్ చేయొద్దని జాహీర్‌తోనే ఆయనకు చెప్పించాను’’ అని గుర్తుచేసుకుంది సోనాక్షి సిన్హా.
అబద్ధాలు చెప్పేదాన్ని
‘‘నేను ఎప్పుడు వచ్చాను అని మా అమ్మ వచ్చి నన్నే నేరుగా అడిగితే ఆ టెలిఫోన్ ఆపరేటర్ ఫోన్ చేయలేదని నాకు అర్థమయ్యేది. అప్పుడు అబద్ధం చెప్పేసేదాన్ని. ఇది ప్రతీ ఇంట్లో జరిగే కథే. అర్థరాత్రి ఫోన్ చేసి ఎక్కుడ ఉన్నావని అడిగేవారు. ఇంకా ఇంటికి రాకపోతే ఎవరైనా చూస్తే బాగుండదు అని తిట్టేవారు. నాన్న నేరుగా నన్ను ఏమీ అనకపోయినా ఆయన పేరు చెప్పే ఆయన ఏమంటారు, ఏమనుకుంటారు అని అమ్మే నన్ను తిట్టేది. మా నాన్న చాలా చిల్‌గా ఉండేవారు. ఆయన నన్ను ఎప్పుడూ తిట్టలేదు’’ అంటూ తన ఇంట్లో వాతావరణం గురించి మొత్తం ఓపెన్ అయిపోయింది సోనాక్షి సిన్హా (Sonakshi Sinha). అంతే కాకుండా తన తల్లిదండ్రులతో రిలేషన్ గురించి కూడా మాట్లాడింది.
Also Read: లీగల్ సమస్యలకు చెక్ పెట్టిన కంగనా.. ఆ సీనియర్ రైటర్‌తో కలిసి ఒప్పందం..
అమ్మకు నేర్పిస్తాను
‘‘నేను అస్సలు ఎదురు సమాధానం చెప్పలేని కూతురిగా మా అమ్మ నన్ను తయారు చేసింది. వాళ్లు కూడా అలాంటి వాతావరణంలోనే పెరిగారు కాబట్టి నాకు కూడా అది నేచురల్‌గా వచ్చేసింది. ఇప్పుడు రోజులు మారిపోయాయి, తరాలు మారిపోయాయి. అందుకే నేను కూడా మా అమ్మకు కొన్ని కొత్త విషయాలు నేర్పిస్తుంటాను’’ అని చెప్పుకొచ్చింది సోనాక్షి సిన్హా. అంత స్ట్రిక్ట్ వాతావరణంలో పెరిగినా కూడా వేరే మతం వ్యక్తి అయిన జాహీర్ ఇక్బాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.