BigTV English

Sangeet Sobhan: సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులకు డబుల్ ఇచ్చేస్తాం.. హీరో ఛాలెంజ్

Sangeet Sobhan: సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులకు డబుల్ ఇచ్చేస్తాం.. హీరో ఛాలెంజ్

Sangeet Sobhan: ఏ అంచనాలు లేకుండా వచ్చి యూత్‌ను ఎంటర్‌టైన్ చేసిన చాలావరకు సినిమాలు సైలెంట్ బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి. అలా దాదాపు రెండేళ్ల క్రితం విడుదలయిన ‘మ్యాడ్’ మూవీ కూడా ఒక రేంజ్‌లో హిట్ అయ్యింది. అప్పట్లో ఆ సినిమాకు ఎంత ప్రమోషన్ చేసినా కూడా కేవలం మౌత్ టాక్‌తోనే ఆ రేంజ్‌లో సక్సెస్ సాధించింది ‘మ్యాడ్’. అందుకే దానికి సీక్వెల్ తెరకెక్కించాలని మేకర్స్ అప్పుడే నిర్ణయించారు. ఇక ఫైనల్‌గా ‘మ్యాడ్’కు సంబంధించిన సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమా గురించి చెప్పడానికి మేకర్స్ ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేయగా.. అందులో హీరో ఒక ఛాలెంజ్ చేశాడు.


సీట్లలో కూర్చోలేరు

‘మ్యాడ్’ లాగానే ‘మ్యాడ్ స్క్వేర్’లో కూడా నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ పార్ట్‌లోని కామెడీని ఏ మాత్రం మిస్ చేయకుండా సీక్వెల్‌లో దానిని రీక్రియేట్ చేయాలనుకున్నారు మేకర్స్. అందులో కొంతవరకు సక్సెస్ అయ్యారు కూడా. అందుకే తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో ‘మ్యాడ్ స్క్వేర్’ కచ్చితంగా హిట్ అవుతుందని హీరోలు ముగ్గురు నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘మ్యాడ్ 1కు మించి మ్యాడ్ 2 ఉంటుంది. థియేటర్లలో ఎవరూ సీట్లలో కూర్చొని ఉండరు. సినిమా చూస్తూ అంతలా నవ్వుతారు’’ అని నమ్మకం వ్యక్తం చేశాడు నార్నే నితిన్.


డబ్బులకు డబుల్

‘‘మీరు టీజర్‌లో చూసింది చాలా తక్కువ. సినిమాలో అంతకు మించి ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది. మ్యాడ్ స్క్వేర్‌పై అంచనాలు ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నాయి. మ్యాడ్ సినిమా సమయంలో నిర్మాత వంశీ గారు ఒక మాట చెప్పారు.. సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తామని. ఇప్పుడు ఆయన మాటగా నేను చెప్తున్నా.. ఎవరికైనా సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులకి డబుల్ ఇచ్చేస్తాం. మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం’’ అంటూ ‘మ్యాడ్ స్క్వేర్’ హిట్ అవుతుందని గట్టి నమ్మకంతో ఛాలెంజ్ విసిరాడు సంగీత్ శోభన్ (Sangeet Sobhan). కానీ ఏ అంచనాలు లేకుండా వచ్చింది కాబట్టి ‘మ్యాడ్’ హిట్ అయ్యింది. మామూలుగా అలాంటి హిట్ సినిమాలకు సీక్వెల్‌గా తెరకెక్కేవి కూడా అదే రేంజ్‌లో హిట్ అవ్వడం చాలా అరుదు.

Also Read: ఆ డ్యాన్స్ మూవ్స్ ఏంటి బన్నీ.. అది ఒళ్లా, విల్లా? ‘గంగోత్రి’కి ముందే..

మామూలు విషయం కాదు

‘‘మ్యాడ్ సినిమా సమయంలో మాకు అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. మొదటి సినిమాకు అంత ఆదరణ రావడం మామూలు విషయం కాదు’’ అంటూ ఈ సినిమాలో నటించడంపై సంతోషం వ్యక్తం చేశాడు రామ్ నితిన్. మొత్తానికి మార్చి 29న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. ఇప్పటికే ‘మ్యాడ్ స్క్వేర్’ నుండి పలు పాటలు విడుదలయ్యి కుర్రకారు స్టెప్పులు వేసేలా చేస్తున్నాయి. ఫస్ట్ పార్ట్‌లో ఎలా అయితే పాటల వల్ల సినిమాకు హైప్ లభించిందో సెకండ్ పార్ట్‌లో కూడా అదే జరగనుందని తెలుస్తోంది. ఇక నిర్మాత నాగవంశీ సైతం ఈ సినిమా సక్సెస్ గురించి ధీమాగా ఉన్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×