Tirupati Reddy on KTR Harish rao: లగచర్ల ఘటనపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కేటీఆర్ చేసిన కామెంట్లపై మండిపడ్డారు సీఎం రేవంత్ బ్రదర్ తిరుపతిరెడ్డి. సీఎం రేవంత్‌రెడ్డి పేరు ప్రతిష్టలు దెబ్బతీసేందుకే హరీష్‌రావు, కేటీఆర్‌లు ఇలాంటివి చేస్తున్నారని ఆరోపించారు.
అధికారులపై దాడి ఘటనలో ముమ్మాటికీ బీఆర్ఎస్ శక్తులు పని చేశాయన్నారు. నిందితులు ఎంతటి వారైనా సరే పోలీసులు అరెస్ట్ చేసి తీరుతారన్నారు. ఘటనలో గాయపడిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, మిగతా అధికారులను బుధవారం ఆయన పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంటే అమాయకులను రెచ్చగొట్టారని అన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
హరీష్‌రావు మాదిరిగా మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ కోసం రాత్రికి రాత్రే గ్రామాలను ఖాళీ చేయించి రైతులను వేధించలేదన్నారు. అమాయక రైతులను డబ్బులిచ్చి మరి రెచ్చగొట్టారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కొడంగల్ అభివృద్ధి ఆగదని, ఈ నియోజకవర్గంలో కంపెనీలు రావడం ఖాయమన్నారు.
ALSO READ: లగచర్ల ఘటన, రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు
అమాయక రైతులపై కేసులు పెట్టలేదని, దాడిలో పాల్గొన్నవారిపై మాత్రమే కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. దాడులు ప్రేరేపించిన వారిని ఎవరినీ వదిలి పెట్టేదిలేదన్నారు సీఎం రేవంత్ బ్రదర్ తిరుపతిరెడ్డి.
సీఎం పేరు ప్రతిష్టలు దెబ్బతీసేందుకే హరీష్ రావు, కేటీఆర్ లు ఇలాంటివి చేపిస్తున్నారు : తిరుపతి రెడ్డి
అధికారులపై దాడి ఘటనలో బీఆర్ఎస్ శక్తులు పనిచేశాయి.
నిందితులు ఎంతటి వారైనా సరే పోలీసులు అరెస్ట్ చేసి తీరుతారు.
హరీష్ రావు లాగా మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ కోసం రాత్రికి రాత్రే… pic.twitter.com/popK0Eczun
— BIG TV Breaking News (@bigtvtelugu) November 13, 2024