BigTV English

Vikarabad Violence: లగచర్ల ఘటన, రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు

Vikarabad Violence: లగచర్ల ఘటన, రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు

Vikarabad Violence: వికారాబాద్‌ కలెక్టర్‌పై దాడి ఘటన కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. ఇది ముమ్మాటికీ ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్టు అందులో ప్రస్తావించారు.


లగచర్ల ఘటన కేసులో 46 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఏ1 గా మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సురేష్‌ను ప్రస్తావించారు. దాడి చేసిన 46 మందిని గుర్తించి, వాళ్లపై వివిధ సెక్షన్-3 కింద కేసులు నమోదు చేశారు. 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ప్రధాన నిందితుడు సురేష్‌తో పాటు మరో 29 మంది ఉన్నారు.

భోగముని సురేష్‌రాజ్ కలెక్టర్ వద్దకు వచ్చి సమావేశానికి రైతులు ఎవరూ రారని, మీరే మా గ్రామానికి రావాలని కోరాడు. దీంతో అధికారులు అంతా లగచర్ల గ్రామానికి చేరుకున్నారు. ప్రజాభిప్రాయం కోసం గ్రామంలోకి వెళ్ళిన అధికారులపై ఉద్దేశ పూర్వకం గానే దాడి చేశారన్నది ఫస్ట్ పాయింట్.


ప్రజాభిప్రాయ సేకరణ కోసం అడిషనల్ కలెక్టర్ లింగనాయక్, ఇంచార్జ్ కలెక్టర్ ఉమాశంకర్, దుద్యాల్ తహసిల్దార్ కిషన్ నాయక్ జయకుమార్ కొడంగల్ తహసిల్దార్ విజయనాయక్ వెళ్లారు. ఆ తర్వాత వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, స్పెషల్ ఆఫీసర్ వెంకట్‌రెడ్డి సమావేశానికి వచ్చారు.

ALSO READ: కలెక్టర్‌పై దాడి కేసు, మాజీ ఎమ్మెల్యే అరెస్ట్‌పై కేటీఆర్ రియాక్ట్

రైతులతో అధికారులు మాట్లాడటానికి ప్రయత్నిస్తుండగా ఒకేసారి మెరుపు దాడి చేశారు కొందరు. రాళ్లు, కర్రలతో అధికారులను వెంబడించి మరీ దాడి చేశారు. కలెక్టర్ వాహనాన్ని అడ్డగించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రాళ్లు విసిరి, ఆపై దాడికి దిగారు.

కడ ఆఫీసర్‌పై మూకుమ్మడిగా రాళ్లు, కర్రలు దాడి చేశారు. ఆ తర్వాత కారంపొడితో విసిరారు. దాని నుంచి తప్పించుకున్న ఆ అధికారి, స్థానిక ప్రైమరీ స్కూల్‌లో తల దాచుకున్నారు. స్కూల్లోకి చొరబడి దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు కాపాడారు. అడిషనల్ కలెక్టర్, కడ స్పెషల్ ఆఫీసర్‌పై హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో అధికారులు, పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వాహనాలు ధ్వంసం అయ్యాయి.

 

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×