BigTV English

Araku: పచ్చని అడవిలో ప్రకృతి పలకరింత! మేఘాల కొండ అనుభూతులు చెప్పలేనంత!

Araku: పచ్చని అడవిలో ప్రకృతి పలకరింత! మేఘాల కొండ అనుభూతులు చెప్పలేనంత!

Araku: అరకు పేరు వింటే చాలు.. కూల్ వెదర్, ఎత్తైన కొండలు, జలపాతాలు కళ్ల ముందు మెదులుతాయి. ఇక.. చలికాలం వస్తే చాలు టూరిస్టులంతా.. వ్యాలీకి క్యూ కట్టేస్తారు. వింటర్‌లో.. అరకు అందాలు డబుల్ అవుతాయి. ప్రకృతి సోయగాలు మరింత రమణీయతను అద్దుకుంటాయి. పర్యాటకుల్ని ఆకర్షిస్తుంటాయి. అలాంటి అరకులో.. కొండల నడుమ పాల కడలిని తలపించే మాడగడలో ప్రకృతి సోయగం కనువిందు చేస్తోంది. భూతల స్వర్గాన్ని తలపిస్తున్న మేఘాల కొండ.. పర్యాటకుల్ని మరింత మంత్రముగ్ధుల్ని చేస్తోంది.


ఎప్పుడూ.. మన తల మీద ఉండే మేఘాలు.. ఒక్కసారిగా మన కాళ్లకిందకు వచ్చేస్తే ఎలా ఉంటుంది? పాల సముద్రం మీద తేలుతున్నట్లు ఉంటుంది. అందమైన అనుభూతి కలుగుతుంది. అంతకుమించి.. అద్భుతం కళ్ల ముందు కనిపిస్తుంది. ఆ అరుదైన దృశ్యాన్ని చూసేందుకే.. పర్యాటకులు అరకుకు.. క్యూ కడుతున్నారు.

ఈ మేఘాల కొండకు చేరుకోవాలంటే.. అరకు లోయ నుంచి సుమారు 8 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ అద్భుతమైన ప్రదేశం.. మాడగడ గ్రామంలో ఉంది. కొండపైకి చేరుకోవాలంటే ఊళ్లో నుంచి కిలోమీటర్ వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం అక్కడ రోడ్డు పనులు జరుగుతుండటంతో.. కార్లు వెళ్లేందుకు అవకాశం లేదు. ఆటో ద్వారా మేఘాల కొండ దగ్గరికి చేరుకోవాలి. కొండ మీదకి.. కాలినడకన వెళ్లాలి. ఆ ప్రాంతాన్ని చూడగానే.. మనల్ని మనం మైమరిచిపోతాం. కొండల మధ్య పాలసముద్రం మాదిరిగా కమ్మిన మంచు మేఘాలు కనువిందు చేస్తాయి. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి పలకరింతకు.. పర్యాటకులు పులకరించిపోతున్నారు. ఇప్పటిదాకా.. వనజంగి, లంబసింగి అందాలను చూసి టూరిస్టులు ఔరా అనేవారు. కానీ.. ఇప్పుడంతా మేఘాల అందాలని చూసేందుకు మేఘాల కొండకు క్యూ కడుతున్నారు.


Also Read: రణగొణ ధ్వనులుండవ్! కాలుష్యం ఆనవాళ్లుండవ్!.. ఈ బ్యూటీఫుల్ నేచర్ స్పాట్ ఎక్కడో తెలుసా?

మేఘాల కొండపై గిరిజనుల దింసా నృత్యాలు.. మరింత ఆకర్షణగా కనిపిస్తాయి. ఇక్కడికొచ్చిన పర్యాటకులు.. వాళ్ల మాదిరిగానే అలంకరించుకొని.. డ్యాన్స్‌లు చేస్తూ మురిసిపోతున్నారు. కొండల మధ్య ఉన్న మంచు అందాలని కెమెరాల్లో బంధిస్తూ కొందరు.. ప్రకృతిని ఆస్వాదిస్తూ మరికొందరు.. దింసా నృత్యాలు చేస్తూ ఇంకొందరు.. ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడూ.. మోడ్రన్ డ్రెస్సులతో ఉండే పర్యాటకులు.. గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి.. సరికొత్త అనుభూతి చెందుతున్నారు.

మేఘాల కొండపై ప్రకృతి అందాలే కాదు.. పర్యాటకులకు వినోదాన్ని పంచేవి ఎన్నో ఉన్నాయి. గుర్రపు స్వారీ, ఊయలలు, మట్టి పాత్రల తయారీ, గిరిజన సంప్రదాయ డప్పు వాయిద్యాలు.. ఇలా టూరిస్టులను ఎంటర్‌టైన్ చేసేందుకు స్థానికులు బాగానే ఏర్పాట్లు చేశారు. అరకు అంటే.. ప్రకృతి అందాలే కాదు గిరిజన సంప్రదాయ వేషధారణలు, వాళ్ల కట్టు, బొట్టు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇంతటి చక్కని వాతావరణంలో ప్రకృతి సౌందర్యాన్ని చూసే అవకాశం.. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలోనే ఉంటుంది. అరకులో సరికొత్త అనుభూతిని పొందాలనుకుంటే.. కచ్చితంగా మేఘాల కొండకు వెళ్లాలని టూరిస్టులు చెబుతున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×