E-Paper
Advertisement

రైతుల కోసం రోడ్డు పైకి వచ్చిన సీఐ.. ఫోన్ గ్రూపుతో వడ్ల గోస తీర్చిన లతీఫ్!

రైతుల కోసం రోడ్డు పైకి వచ్చిన సీఐ.. ఫోన్ గ్రూపుతో వడ్ల గోస తీర్చిన లతీఫ్!
Advertisement

CI Latheef: స్వేచ్ఛ బ్యూరో: సాధారణంగా పోలీస్ శాఖ అంటే శాంతి భద్రతల పరిరక్షణ అనే భావన ఉంటుంది. అయితే ఆ బాధ్యతలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారంలోనూ ముందుండి పనిచేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. తొగుట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ లతీఫ్. తన సర్కిల్ పరిధిలో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ముఖ్యంగా రైతుల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న సీఐ లతీఫ్, ప్రస్తుతం కొనసాగుతున్న వడ్ల కొనుగోలు ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

అధికారులతో సమన్వయం..

ఇందుకోసం తన సర్కిల్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాల పనితీరుపై సమీక్ష చేస్తున్నారు. ఏ గ్రామంలో సమస్య తలెత్తినా వెంటనే సమాచారం సేకరించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు.రవాణా సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు పడకుండా ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లపై కూడా దృష్టి సారిస్తున్నారు. అవసరమైన చోట లారీలు, డీసీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చి వడ్ల తరలింపు ప్రక్రియలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Also Read: రికవరీ ఏజెంట్ల ఆగడాలకు ఇక బ్రేక్.. నోరు జారితే చేతికి బేడిలే..?

విధి నిర్వహణలో తనదైన ముద్ర..

ఇక గ్రామాల్లో భద్రతా వ్యవస్థ బలోపేతం కోసం సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో నేరాల నియంత్రణతో పాటు భద్రతా వాతావరణం పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.అధికారాన్ని ప్రదర్శించకుండా ప్రజలతో మమేకమై, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ విధి నిర్వహణలో తనదైన ముద్ర వేస్తున్న సీఐ లతీఫ్ సేవలను స్థానికులు అభినందిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న ఆయన పని తీరు పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.

Advertisement

Also Read: డేంజర్ బెల్స్.. తెలంగాణ రాష్ట్రంలో 23 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×