Big Stories

Dasari Sahithi Contest Chevella: చేవెళ్ల బరిలో ‘పొలిమేర’ నటి, అందుకే పోటీ..!

Dasari sahithi Contest Elections 2024 from Chevella: ఎట్టకేలకు తెలంగాణ ఎన్నికల బరిలో టాలీవుడ్ నుంచి ఓ నటి పోటీ చేస్తున్నారు. ఆమె ఎవరోకాదు పొలిమేర, పొలిమేర 2 సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి దాసరి సాహితి. ఈమె చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.

- Advertisement -

బుధవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు నటి సాహితి. అందులో తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. తనకు సుమారు ఐదు లక్షలు రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్‌లో ప్రస్తావించారు. తన వయసు కేవలం 29 ఏళ్లని, ఇంకా మ్యారేజ్ కాలేదని పేర్కొన్నారు. అప్పుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. మరి నామినేషన్ పత్రాల పరిశీలన తర్వాత ఈమె రేసులో ఉంటున్నారా..? లేదా అన్నది చూడాలి.

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ అభిమాని అని చెప్పుకునే ఈ నటి, కొద్దిరోజుల కిందట రాజకీయాలపై స్పందించారు. తన ఇన్‌స్టా రీల్స్‌కు, రాజకీయాలకు ముడిపెట్టవద్దని అభిమానులను కోరారు. సాహితి ఎన్నికల బరిలో ఉండడంతో ఏ పార్టీ ఓట్లను చీల్చుతారో చూడాలి. వెండితెరపై పాపులర్ కావడంతో భారీగా ఓట్లు చీల్చవచ్చని అంటున్నారు. ప్రస్తుతం చేవెళ్ల నుంచి బీజేపీ తరపున కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్‌రెడ్డి, బీఆర్ఎస్ తరపున కాసాని బరిలో ఉన్నారు.

Also Read: తెలంగాణలో వరుస ప్రమాదాలు.. ఒకరు సజీవదహనం, నలుగురు మృతి

పొలిమేర, పొలిమేర 2 సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి దాసరి సాహితి. ఇందులో గెటప్ శ్రీను వైఫ్‌ రాములు పాత్రలో నటించారు. అభిమానులను మెప్పించారు కూడా. ఇదే మూవీకి సంబంధించి పార్ట్ 2లోనూ రాజేశ్‌తో కలిసి నటించారు. ఇవేకాకుండా నితిన్ తీసిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, సింగర్ సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా పరిచయమైన సర్కారు నౌకరి, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అంతకుముందు కొన్ని షార్ట్ ఫిల్మ్‌లో నటించారు సాహితి. ఇక యాంకర్ ప్రదీప్ పెళ్లిచూపులు షోలో ఆమె పాల్గొన్నారు.

తెలంగాణ ఎన్నికల బరిలో టాలీవుడ్ నుంచి నటి సాహితి ఒక్కరేనని అంటున్నారు. ఏపీ నుంచి నటి రోజా, హీరో బాలకృష్ణ ఉన్నారు. తమిళనాడు, కేరళ నుంచి ఈసారి చాలామంది నటీనటులు ఎన్నికల బరిలో నిలిచారు. వారిలో చాలామంది ప్రధాన పార్టీల తరపున బరిలో ఉన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News