TPCC Mahesh Kumar Goud: ఫార్ములా ఈ-రేస్ కేసులో తాను కడిగిన ముత్యమంటూ కేటీఆర్ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకోవడంపై రియాక్ట్ అయ్యారు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్. ఫార్ములా ఈ- రేసులో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనన్నారు. అక్రమాలు జరిగినట్టు పలు ఆధారాలున్నాయన్నారు. తనకు తానే కేటీఆర్ సర్టిఫికేట్ ఇచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ప్రభుత్వం పంపిన ఆధారాలపై గవర్నర్ న్యాయసలహా తీసుకొని కేసుకు అనుమతించాక అక్రమ కేసు ఎలా అవుతుందని సూటిగా ప్రశ్నించారు. చట్టపరంగా కేసు నమోదు అయినందున కోర్టులో తేల్చుకోవాలని సూచన చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.
ఈ-రేస్‌లో HMDA భాగస్వామ్యం కాకపోయినా విదేశీ సంస్థకు ఆనాడు 55 కోట్ల నిధులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అంతేకాదు మూడేళ్ల పాటు రేసింగ్ జరిగేలా 600 కోట్లతో ఒప్పందం జరగలేదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్ ప్రతిష్ట ఏ మాత్రం పెరగలేదన్నారు.
ప్రజలను ఇబ్బంది పెట్టి ట్రాఫిక్ జాములు చేసి ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించారని మండిపడ్డారు. ఆధారాలు కనిపిస్తున్నా అక్రమాలకు పాల్పడలేదని కేటీఆర్ బుకాయించడాన్ని తప్పుబట్టారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు నిధులు మంజూరు ఎలా చేస్తారని అన్నారు.
ALSO READ: కేటీఆర్ ఫార్ములా, బిగిస్తున్న ఉచ్చు.. వివరాలు ఇవ్వాలంటూ ఈడీ లేఖ
హద్దుల్లేని కేటీఆర్ అక్రమాలతో అధికారులు బలిపశువులుగా మారారని చెప్పుకొచ్చారు. నిబంధనలకు విరుద్దంగా హుస్సేన్‌సాగర్ చుట్టూ ఫార్ములా ఈ రేసు కోసం 2.8 కి.మీల ప్రత్యేక ట్రాక్‌ను ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. నిబంధనలను అతిక్రమించి ప్రజలను ఇబ్బంది పెట్టడం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడమా? బీఆర్ఎస్ నేతల దోపిడీతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారని, ఏం చేసినా వారి స్వలాభం కోసమేనన్నారు.
ప్రజలు ఛీకొట్టి గద్దె దింపినా అధికారంలో ఉన్నామనే భ్రమలతో కేటీఆర్ బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. కేసులో అధికారులకు సహకరించాల్సిన కేటీఆర్, అహంకారంతో విర్రవీగుతూ ఉద్యమకారులంటూ కేసుకు సంబంధం లేని మాటలు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
కేటీఆర్ పై కేసు సక్రమమైన చర్యనే
బీఆర్ఎస్ హయాంలో ప్రతి రంగంలోనూ అవినీతి జరిగింది
అందుకే ప్రజలు బీఆర్ఎస్ ను ఇంటికి పంపారు
అధికారం కోల్పోయినా ఇంకా అదే అహంకారంతో కేటీఆర్ మాట్లాడుతున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు… pic.twitter.com/g9s1ytVycf
— BIG TV Breaking News (@bigtvtelugu) December 20, 2024