BigTV English

Upendra’s UI Movie Review : యూఐ మూవీ రివ్యూ

Upendra’s UI Movie Review : యూఐ మూవీ రివ్యూ
Advertisement

మూవీ : యూఐ
రిలీజ్ డేట్ : 20 డిసెంబర్ 2024
డైరెక్టర్ : ఉపెంద్ర
నటీనటులు : ఉపెంద్ర, ఉపేంద్ర, రీష్మా నానయ్య, సన్నీ లియోన్, సాధు కోకిల, జిషు సేన్‌గుప్తా, మురళీ శర్మతో పాటు తదితరులు
నిర్మాత : జి. మనోహరన్, శ్రీకాంత్ కె. పి.
నిర్మాణ సంస్థ : లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్


Upendra’s UI Movie Rating : 2/5

Upendra’s UI Movie Review and Rating : ఈ జనరేషన్ వాళ్లకు ఉపేంద్ర డైరెక్షన్ గురించి పెద్దగా తెలీదు. ఉపేంద్ర డైరెక్షన్‌లో వచ్చిన ‘A’, ‘రా’, ఉపేంద్ర లాంటి సినిమాలకు ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ డైరెక్టర్‌గా మారి చేస్తున్న సినిమా ”యూఐ’ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మళ్లీ ‘A’, ‘రా’ లాంటి సినిమా వస్తుందని అనుకున్నారు. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా..? ఉపేంద్ర డైరెక్షన్ ఎలా ఉంది..? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం…


కథ :

 

ఉపేంద్ర (ఉపేంద్ర) ఓ మూవీ డైరెక్టర్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘నామం’ (UI) మూవీ రిలీజ్ అవుతుంది. ఆ సినిమాను కేవలం మూర్ఖులు మాత్రమే చూడగలరు అని చెబుతూ థియేటర్‌‌లో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ సినిమా చూస్తే ఓ ఫోకస్ దొరుకుతుందని, ఆ.. ఫోకస్ దొరికితే మీకు మూవీ అర్థమైనట్టు అని చెబుతాడు. అలా సినిమా చూసిన ఆడియన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ మళ్లీ మళ్లీ చూస్తారు. కొంత మంది బ్యాన్ చేయాలి అంటూ గొడవలు చేస్తారు. అలాగే ఓ రివ్యూ రైటర్ (మురళీ శర్మ) ఈ మూవీ రివ్యూ రాయడానికి ఆలోచిస్తూ ఉంటాడు. మూవీ రిలీజై వారం గడుస్తున్నా… రివ్యూ రాయలేక ఉండిపోతాడు. రివ్యూ రాయలేదా అని ఆఫీస్ నుంచి కాల్ వస్తే… దీనిపై తాను రీసర్చ్ చేస్తున్నట్టు చెబుతాడు.

అలా రీసర్చ్ స్టార్ట్ చేసిన ఆ రివ్యూ రైటర్‌కి డైరెక్టర్ ఉపేంద్ర ఫస్ట్ రాసుకున్న UI మూవీ స్క్రిప్ట్ కనిపిస్తుంది. ఆ స్క్రిప్ట్ లో ఏం ఉంది అనేదే ఈ UI సినిమా. ఆ స్క్రిప్ట్ ప్రకారం… యూఐ సినిమాలో ఓ తల్లిని సామూహిక అత్యాచారం చేస్తారు. ఆ తల్లికి ఇద్దరు కవలలు పుడుతారు. వాళ్లే సత్య (ఉపేంద్ర), కల్కి (ఉపేంద్ర). ఈ ఇద్దరు సమాజం కోసం ఏం చేస్తారు..? కళియుగంలో పరిస్థితి ఎలా ఉంది..? జాతి, మతం, ధర్మం కోసం జానాలు ఏం చేస్తారు అనేవి మిగితా కథ.

విశ్లేషణ:

సినిమా ప్రారంభంలోనే…
“మీరు తెలివైనోళ్లు అయితే వెంటనే థియేటర్ నుంచి బయటికి వెళ్లిపోండి”
“మీరు మూర్ఖులు అయితే పూర్తి సినిమా చూడండి”
అయితే “తెలివైనోళ్లు మూర్ఖుల్లా… మూర్ఖలు తెలివైనవారిలా కనిపిస్తారు” అని చెబుతూ సినిమాను స్టార్ట్ చేస్తారు… ఈ లైన్స్‌తోనే సినిమాపై ఓ అవగాహన వస్తుంది.

ఉపేంద్ర గురించి, ఆయన డైరెక్షన్ గురించి అందరికీ తెలుసు. సమాజాన్ని ఆయన రెగ్యూలర్‌గా కాకుండా ఓ రకంగా చూస్తాడు. అందుకే ఆయన నుంచి అలాంటి కథలు వస్తాయి. ఆడియన్స్ కూడా ఆయన సినిమాను రెగ్యూలర్ గా కాకుండా ఓ రకంగా చూడాలి. అలా చూస్తే ఓ గ్రేట్ మెసెజ్ కనిపిస్తుంది. అవును ఈ సినిమా కూడా మెసేజ్ ఇచ్చే మూవీనే.

భూమి మీద తొలి జంట ఆడమ్ – ఈవ్ నుంచి నేటి కళి యుగం వరకు స్వార్థం ఉంది అని మూవీలో చూపించాడు.. సమాజంలో స్వార్థం ఎక్కువ ఉంటుందని. జాతి, మతం, ధర్మం వీటి పైనే సమాజం నడుస్తుందని, మంచి, శాంతి, సత్యాన్ని సమాజం కోరుకుందని, ఇది ఇప్పుడే కాదు… 2040లోనూ ఇలాగే ఉంటుందని ఈ సినిమాతో చూపించాడు ఉపేంద్ర. మొత్తం సినిమాలో ఉండేది ఇదే.

అయితే దాన్ని ఉపేంద్ర ఎలా చూపించాడు అనేది పాయింట్‌గా తీసుకుంటే… చాలా వరకు యూఐ కాన్సెప్ట్ అర్థమైపోతుంది. సినిమాలో ఆడియన్స్ కు పరీక్ష ఉంటుంది అని ఏం లేదు. ఉపేంద్ర ఏం చెప్పాలి అనుకున్నాడో ఈజీగానే అర్థమైపోతుంది. క్లైమాక్స్ వరకు అయినా తెలిసిపోతుంది.

సినిమా క్లైమాక్స్‌లో ఉపేంద్ర క్యారెక్టర్ ఒకటి చెబుతుంది… ఇలాంటి మెసేజ్ ఇచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గింది అని అంటారు అని సినిమాలో వచ్చిన ఓ సినిమా గురించి చెబుతాడు. అవును… ఆ క్యారెక్టర్ చెప్పింది నిజమే. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను ఆడియన్స్‌కు నచ్చేలా తీయడం అంటే అంత ఈజీ కాదు.

ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసేలా మెసేజ్ ఇవ్వడంలో ఉపేంద్ర ఫెయిల్ అయ్యాడు. కామెడీ, రొమాన్స్, సాంగ్స్ లాంటివి ఎక్స్‌పెక్ట్ చేయకపోవచ్చు. కానీ, కధనంతో అయినా… ఆడియన్స్‌ను గ్రాబ్ చేయ్యాలి. కానీ, అలాంటి ప్రయత్నం కనిపించలేదు. ఫస్టాఫ్ లో కధనం చాలా స్లోగా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో స్పీడ్‌గానే ఉన్నా.. ఎక్కడో లోపం ఉంది అని మాత్రం అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ మాత్రం సినిమాలో ఎండ్ లెస్ అని చూపించారు. కానీ, ఎండ్ లెస్ కాదు.. ఇన్ కంప్లీట్ అని పెడితే బాగుంటుందేమో…

దాదాపు కల్కి మూవీ కలరింగ్ ఈ సినిమాకు ఉంటుంది. కల్కి ప్రపంచానికి నాగ్ అశ్విన్ దాదాపు 600 కోట్లతో సృష్టిస్తే, ఈ యూఐ సినిమాలో కల్కి ప్రపంచాన్ని 100 కోట్లతోనే సృష్టించాడు.

ఉపేంద్ర యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమా నడిచింది అంటే అది కేవలం ఉపేంద్ర యాక్టింగ్ వల్లే. ఇక తర్వాత రవి శంకర్, మురళీ శర్మ క్యారెక్టర్స్ కొంత మేరకు కనిపిస్తాయి. తర్వాత నటీనటులకు పెద్దగా స్కోప్ లేదు. వాళ్లు ఉన్నట్టు కూడా తెలీదు. అజనీష్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రాఫికి మంచి మార్కులే వేయొచ్చు.

 

ప్లస్ పాయింట్స్ :

ఉపేంద్ర
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
కథ

మైనస్ పాయింట్స్ :

స్లో కధనం

Upendra’s UI Movie Rating : 2.75/5

Related News

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Big Stories

×