Harishrao writes to Rahul gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీమంత్రి, సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తాజాగా లేఖ రాశారు. రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా ఆయన బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ ఆ లేఖలో హరీశ్ రావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష, వ్యాఖ్యలను అరికట్టాలంటూ లేఖలో హరీశ్ రావు రిక్వెస్ట్ చేశారు.
Also Read: ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి వదిలేస్తున్నా.. ఇంకోసారి వచ్చినప్పుడు కూడా ఇలానే ఉంటే ఊరుకోను: బండి సంజయ్
‘సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్న భాష, వ్యాఖ్యలను కట్టడి చేయండి. అటువంటి వ్యాఖ్యలు రాజకీయాల్లో వాడటం అంత మంచిదికాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఏ మాత్రం పాటించడంలేదు. మాజీ సీఎం కేసీఆర్ పై ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దిగజారుడు తనానికి అత్యంత నిదర్శనం. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు తీవ్రవాది అంటూ వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ వెంటనే స్పందించి, దేశవ్యాప్తంగా నిరసనలను చేపట్టింది. రాజ్యాంగ విలువలను దిగజారుస్తూ మాట్లాడుతున్నారంటూ నాడు ఖండించింది. రాజకీయాల్లో ఇటువంటి దిగజారుడు విమర్శలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కాంగ్రెస్ పేర్కొన్నది. ఇప్పుడు అదేవిధంగా వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డిపై చర్యలేవీ? ఇది కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్ కు నిదర్శనమేగా?
ఢిల్లీలో ఒక రూల్.. గల్లీలో మరో రూల్ ఫాలో అవుతారా? ఈ విధంగా డబుల్ రోల్స్ ప్లే చేయడం కాంగ్రెస్ కే చెల్లుతుంది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్ తన నైతిక ప్రమాణాలను పాటించకుండా ఇతరులకు నీతులు చెప్పడం చూస్తుంటే నవ్వొస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కేసీఆర్ ను రాళ్లతో కొట్టాలంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ హైకమాండ్ సమర్థిస్తుందా? రేవంత్ రెడ్డి ఆ విధంగా వ్యవహరిస్తూ తన స్థాయిని దిగజార్చుకుంటున్నారు.
Also Read: హైడ్రా భయం.. అటువైపు చూడని కస్టమర్లు.. టార్గెట్ లేక్ వ్యూ భవనాలా?
రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామంటూ పదే పదే పేర్కొనే రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా? పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై నిరాధార కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారు. ఇది అత్యంత దుర్మార్గం. రేవంత్ నాయకత్వంలో రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుంది. వెంటనే రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకోవాలి’ అంటూ హరీశ్ రావు ఆ లేఖలో పేర్కొన్నారు.