BigTV English

Pushpa 2 Updates : మెగాస్టార్ ఫ్యాన్ గా పుష్పరాజ్.. తగ్గేదేలే .. కటౌట్ వైరల్..

Pushpa 2 Updates : మెగాస్టార్ ఫ్యాన్ గా పుష్పరాజ్.. తగ్గేదేలే .. కటౌట్ వైరల్..
Pushpa 2

Pushpa 2 Updates : టాలీవుడ్ సినీ చరిత్రలో పుష్ప మూవీ ఎటువంటి ప్రభంజనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎటువంటి బజ్ లేకుండా సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్ పై వైలెంట్ గా దాడి చేసింది ఈ చిత్రం. బన్నీని స్టైలిష్ స్టార్ నుంచి ఏకంగా ఐకానిక్ స్టార్ గా మార్చింది పుష్ప. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో క్రెడిట్ తన ఖాతాలో పెట్టుకున్న ఈ చిత్రం త్వరలో పుష్ప 2 సీక్వెల్ గా మన ముందుకు రానుంది. ఈ మూవీ ని డైరెక్టర్ సుకుమార్ చాలా భారీ బడ్జెట్ తో అంతకంటే భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తున్నారు.


అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇంతకీ విషయం ఏమిటంటే బన్నీ పుష్ప2 మూవీలో ఇంద్రసేనారెడ్డి కనిపించబోతున్నాడు. మరి ఇది ఎలా జరుగుతుంది?అసలు కథ ఏంటి అంటే.. పుష్ప మూవీ ప్రజెంట్ జనరేషన్ టైం లో తీసింది కాదు.. కథ అనుసారంగా ఇది 90 ల ప్రాంతానికి సంబంధించిన చిత్రం. కాబట్టి రెండవ భాగంలో 2000 సంవత్సరం దరిదాపుల్లో ఎక్కువ ఇన్సిడెంట్స్ జరిగినట్లు చూపిస్తారు అని టాక్. ఈ నేపథ్యంలో పుష్ప 2 సినిమాలో మెగాస్టార్ నటించిన ఇంద్ర సినిమా ప్రస్తావన రావడం జరిగింది.

2000 సంవత్సరం అంటే.. మెగాస్టార్ ఇండస్ట్రీ ని రూల్ చేసే సమయం. పుష్ప 2 మూవీలో చాలావరకు కీలక ఘట్టాలు కూడా ఇదే టైంలో జరిగినట్టు షూటింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప చిరంజీవికి వీరాభిమానిగా కనిపిస్తాడు. ఇంద్ర సినిమాకి సంబంధించి హాల్ బయట పెద్ద పోస్టర్ కూడా వేయిస్తాడు పుష్ప. పుష్పరాజ్ యువసేన తిరుపతి అంటూ మెగాస్టార్ ఇంద్ర పోస్టర్ పై పుష్ప ఫోటోతో ఉన్న ఒక భారీ కట్ అవుట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.


నిజ జీవితంలో కూడా బన్నీ మెగాస్టార్ కి వీరాభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే స్క్రీన్ పై కూడా తన అభిమానాన్ని బన్నీ ఈ విధంగా చాటుకున్నాడు అని మెగా ఫాన్స్ మురిసిపోతున్నారు.

పుష్ప మూవీలో బన్నీ నటనకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పుష్ప 2 చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈసారి ఈ మూవీ కోసం బడ్జెట్ విషయంలో రాజీ పడేదే లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

తండ్రి లేడని సమాజం చిన్నచూపు చూస్తూ ఉంటే రోజువారి కూలీగా తన జీవితాన్ని మొదలుపెట్టిన ఒక యువకుడు ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ కి నాయకుడిగా ఎలా ఎదుగుతాడు.. అనే ఆసక్తికరమైన ఘట్టాన్ని పార్ట్ వన్ లో డైరెక్టర్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అయితే వచ్చే ఆగస్టు 15 విడుదల కాబోయే పార్ట్ 2 లో స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న పుష్పా కు పరివర్తన ఎలా వస్తుంది? అతను ఎదుర్కొనే పరిస్థితులు ఎలాంటివి? అనే విషయాన్ని చూపించడంతో పాటు ఈ చిత్రం ద్వారా మంచి సందేశాన్ని కూడా అందించబోతున్నారని తెలుస్తోంది. ఇంతకీ పూర్తి స్టోరీ తెలియాలి అంటే ఆగస్టు 15 వరకు ఆగాల్సిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×