BigTV English
Advertisement

Raa Macha Macha : రోజులు మారిన టాప్ ప్లేస్ మారలేదు, ఇది సార్ మీ రేంజ్

Raa Macha Macha : రోజులు మారిన టాప్ ప్లేస్ మారలేదు, ఇది సార్ మీ రేంజ్

Raa Macha Macha : కొన్ని కాంబినేషన్స్ లో ఒక సినిమా వస్తుంది అంటేనే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అచ్చంగా అలాంటి కాంబినేషన్ శంకర్ & రామ్ చరణ్ ది. దాదాపు ఐదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఇప్పటికీ షూటింగ్ జరుగుతూనే ఉంది. ఈ సినిమాతో పాటుగా మొదలైన ఇండియన్ టు సినిమా కూడా విడుదల అయిపోయింది. అయితే ఇండియన్ టు రిజల్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంచనాలన్నీ కూడా శంకర్ చేస్తున్న గేమ్ చేంజెర్ సినిమా పైన ఉన్నాయి. గ్లోబల్ స్టార్ ఇమేజ్ సాధించుకున్న తర్వాత చరణ్ కంప్లీట్ హీరోగా కనిపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ చేశారు. ఎస్ఎస్ థమన్ సినిమాకి సంగీతం అందించాడు.


మొదటిగా ఈ సినిమా నుండి మార్చి 27న రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా “జరగండి” అనే పాటను రిలీజ్ చేశారు. ఈ పాట అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఇదివరకే శంకర్ దర్శకత్వం వహించిన అపరిచితుడు సినిమాలోని “కొండకాకి” పాట రేంజ్ లో ఈ పాట ఉండబోతుంది అని చాలా వార్తలు కూడా వినిపిస్తూ వచ్చాయి. ఇక ఇదే పాట ఇండియన్ 2 సినిమాలో ఒకచోట ప్లే అయినప్పుడు థియేటర్లో రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నాము అని ప్రొడ్యూసర్ దిల్ రాజు చాలా సార్లు అప్డేట్ ఇచ్చారు. అయితే రీసెంట్ టైమ్స్ లో ఈ సినిమా సంక్రాంతి కూడా వచ్చే అవకాశం ఉంది అని కథనాలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర అవుతున్న టైంలో ఈ సినిమాలో నుండి “రా మచ్చా రా” అనే పాటను రిలీజ్ చేసారు. ఇక ఈ పాట విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ పాటకి రెస్పాన్స్ మామూలుగా లేదు అని చెప్పాలి. తెలుగులో 27 మిలియన్స్ వ్యూస్, హిందీలో 18 మిలియన్ వ్యూస్, తమిళ్ లో 760k వ్యూస్ వచ్చాయి. మొత్తంగా దాదాపు 46 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ పాట ఇప్పటికీ టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇంకో రెండు రోజుల్లో ఈ పాట 50 మిలియన్ వ్యూస్ సాధించుకున్న కూడా పెద్దగా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. ఈ వ్యూస్ చూస్తుంటే సినిమా పైన ఎంత పాజిటివ్ బజ్ అర్థమవుతుంది. అయితే దీనిని చిత్ర యూనిట్ పర్ఫెక్ట్ గా వాడుకుంటే బ్లాక్ బస్టర్ పడినట్టే.


ఇండియన్ టు సినిమా తర్వాత శంకర్ మీద చాలా నెగెటివిటీ వచ్చింది. అంచనాలను అందుకోవాల్సిన విషయం పక్కన పెడితే చాలామందికి మినిమం ఆ సినిమా నచ్చలేదు. ఇక గేమ్ చేంజెర్ సినిమాపై తగ్గుతాయి అనుకున్న తరుణంలో, ఇప్పుడు పాటలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరుగుతున్నాయి అని అర్థమవుతుంది. అయితే ఈ అంచనాలను ఏ మేరకు అందుకుంటారో అని తెలియాలి అంటే కొంతవరకు వెయిట్ చేయడం తప్పదు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×