BigTV English

Kushboo Angry: మంత్రి కొండా సురేఖపై కుష్బూ ఆగ్రహం.. కేవలం రెండు నిమిషాల కోసం..

Kushboo Angry: మంత్రి కొండా సురేఖపై కుష్బూ ఆగ్రహం.. కేవలం రెండు నిమిషాల కోసం..

Kushboo Angry: మంత్రి కొండా సురేఖ- కేటీఆర్ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారం కాస్త ఫిల్మ్ ఇండస్ట్రీ వైవు మళ్లింది. మంత్రి కామెంట్స్‌ను పలువురు సినీ ప్రముఖులు తప్పుబట్టారు.. ఖండిస్తున్నారు కూడా. ఇందులో భాగంగా సీనియర్ నటి, బీజేపీ నేత కుష్బూ కూడా రియాక్ట్ అయ్యారు.


మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేశారు బీజేపీ నేత‌, న‌టి కుష్బూ. కేవలం రెండు నిమిషాల ఫేమ్ కోసం ఇలాంటి భాష మాట్లాడతారా అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇక్కడ స్త్రీత్వానికి ఘోర అవమానాన్ని చూస్తున్నామని గుర్తు చేశారు. కొండా సురేఖ గారూ మీలోని విలువలు ఏమైపోయాయింటూ ప్రశ్నించారు.

ALSO READ: వెనక్కి తగ్గేదిలేదు, క్షమాపణ చెప్పాల్సిందే.. కేటీఆర్‌కు కొండ సురేఖ మరోసారి వార్నింగ్


బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు.. ఫిల్మ్ ఇండస్ట్రీపై ఇలాంటి నిరాధారమైన, భయంకరమైన, కించపరిచే ప్రకటనలు చేయ‌రాదన్నారు. ఆధారాలు లేని ఆరోప‌ణ‌లు చేస్తే సినీ పరిశ్రమ చూస్తూ కూర్చోదన్నారు. ఇలాంటి నిరాధారమైన, తప్పుడు ఆరోపణల చేసినందుకు మీరు మొత్తం సినీ పరిశ్రమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది వన్‌వే ట్రాఫిక్ కాదన్నారు ఖుష్బూ. పరిస్థితి గమనించిన మంత్రి కొండా సురేఖ గురువారం ఉదయం నటి సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. తనకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ద్వేషం లేదని, అనుకోని సందర్భంలో ఆమె పేరు ప్రస్తావించడం అనుకోకుండా జరిగిపోయిందని వివరించిన విషయం తెల్సిందే.

 

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×