E-Paper
Advertisement

నీట్ పరీక్ష రద్దు వెనుక అసలు నిజాలివే.. కేంద్రంపై విరుచుకుపడ్డ మహేష్ కుమార్ గౌడ్!

నీట్ పరీక్ష రద్దు వెనుక అసలు నిజాలివే.. కేంద్రంపై విరుచుకుపడ్డ మహేష్ కుమార్ గౌడ్!
Advertisement

Mahesh Kumar Goud: టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ లిబర్టీ సర్కిల్ వద్ద కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీట్ పరిక్ష రద్దు, విద్యార్ధుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతుందని కేంద్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం

Advertisement

నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ చేతగానితనానికి, వైఫల్యానికి నిదర్శనమని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నెలల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి చదివితే, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వారి శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది కుటుంబాల భవిష్యత్తును రోడ్డున పడేసినందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిసెంబర్ డిమాండ్ చేశారు. ఈ సంక్షోభంలో నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

దేశ రక్షణలో వైఫల్యం

Advertisement

కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత కేవలం విద్యా వ్యవస్థకే పరిమితం కాలేదని, దేశ రక్షణలోనూ స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. చైనా వారు దేశ సరిహద్దుల్లోకి చొచ్చుకు వస్తున్నా కేంద్రం చేష్టలుడిగి చూస్తోందని, ఇది వారి చేతగానితనానికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే కేంద్ర ప్రభుత్వం తన అసలు స్వరూపాన్ని బయటపెట్టిందని మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. ఎన్నికలు ముగిసిన వెంటనే సామాన్యుడిపై భారం మోపుతూ ఎల్‌పీజీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను విచ్చలవిడిగా పెంచేసిందని మండిపడ్డారు.

తెలంగాణలో ప్రజా పాలన

కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంటే, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం అందుకు భిన్నంగా పనిచేస్తోందని ప్రశంసించారు. రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి, పేదలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.

Also Read:అమెరికాలో భారతీయుల శకం ముగిసిందా? టెకీలను వెంటాడుతున్న కొత్త భయాలు!

Related News

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

Big Stories

Advertisement
×