BigTV English

RGV: అహంకారంతో నా కళ్లు నెత్తికెక్కాయి.. ఇకనుంచి అలా చేయను.. ఎట్టకేలకు బుద్ది తెచ్చుకున్న వర్మ

RGV: అహంకారంతో నా కళ్లు నెత్తికెక్కాయి.. ఇకనుంచి అలా చేయను.. ఎట్టకేలకు బుద్ది తెచ్చుకున్న వర్మ

RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  శివ, రంగీలా, సత్య, మనీ, క్షణక్షణం, గోవిందా గోవిందా.. ఇలా వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ మాత్రమే కాదు కల్ట్ క్లాసిక్ గా మారాయి. ఇప్పటికీ చాలామంది వర్మలాగా సినిమాలు తీయడం కష్టమే అని చెప్పుకొస్తారు. కానీ ఆ వర్మ ఇప్పుడు లేడు. వివాదాలతో, విమర్శలతో నిత్యం  సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ తిరుగుతున్నాడు. ఇక అంత మంచి సినిమాలు తీసిన వర్మ .. అమ్మాయిలతో  అసభ్యకరమైన సన్నివేశాలను కథగా  రాసి సినిమాలు తీస్తున్నాడు.


ఇక వర్మ నుంచి అలాంటి సినిమా వచ్చిన దగ్గరనుంచి అసలు వర్మ ఎలా  ఉండేవాడు.. ఎలా అయిపోయాడు అని కొందరు.. ఎలాంటి సినిమాలు తీశాడు.. ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేస్తున్నాడు అని ఇంకొందరు.. ఇక వర్మలో పస  లేదు. సినిమాలు ఆపేస్తే బెటర్  అని కామెంట్స్ పెడుతూ వచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే.. సోషల్ మీడియాలో కూడా రాజకీయాల్లో వేలు పెట్టి.. వారికి, వీరికి గొడవలు పెట్టేలా ట్వీట్స్ పెట్టి ఆనందిస్తున్నాడు.  అయితే ఇప్పుడు అవన్నీ మానేశాను అని చెప్పుకొచ్చాడు వర్మ. ఆయన దర్శకత్వంలో వచ్చిన సత్య సినిమా 27 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

ఇక దీంతో సత్య సినిమా ఇంకోసారి చూసినప్పుడు తనకు జ్ఞానోదయం అయ్యిందని వర్మ ఒక సుదీర్ఘమైన నోట్  రాసుకొచ్చాడు. “సత్య సినిమా  27 సంవత్సరాల తర్వాత  రెండు రోజుల క్రితం మొదటిసారి చూసినప్పుడు నా కళ్ల నీళ్లు ఆగలేదు. ఈ కన్నీళ్లు సినిమా కోసం కాదు.. ఆ తరువాత జరిగిన పరిణామాల వలనే ఎక్కువ  వచ్చాయి. ఒక సినిమాను తెరకెక్కించడం అంటే.. ఒక బిడ్డకు జన్మనివ్వడంలాంటిదే. ముక్కలు ముక్కలుగా ఉన్న సినిమాను ఒక తాటిమీదకు తీసుకురావాలి. ఇక ఆ సినిమా గురించి ఇతరులు ఏమంటారో తెలుసుకోవడం కూడా ముఖ్యమే. ఆ తరువాత అది హిట్ అవుతుందో లేదో అనేది పట్టించుకోకుండా.. నేను వేరే పనిలోనిమగ్నమై ఉంటాను.


Rashmika Mandanna: పుష్పకు శ్రీవల్లీ.. చావాకు యేసుబాయి.. రష్మిక నామ సంవత్సరం మొదలు

2 రోజుల క్రితం వరకు లక్ష్యం లేని గమ్యం వైపు నా ప్రయాణం సాగింది. సత్య సినిమా చూసాకా.. హోటల్‌కు తిరిగి వచ్చి, చీకటిలో కూర్చున్నప్పుడు నాకు అర్థం కాలేదు.  నా అంతటి తెలివితేటలతో, భవిష్యత్తులో నేను ఏమి చేయాలో ఈ సినిమాను ఒక బెంచ్‌మార్క్‌గా ఎందుకు సెట్ చేయలేదు అని ఆలోచించాను. ఈ సినిమాలో జరిగిన విషాద ఘటనల వలన నాకు ఏడుపు రాలేదు కానీ, ఇలాంటి గొప్ప సినిమా నేను తీసానా అని ఏడ్చాను. సత్య కారణంగా నన్ను నమ్మిన వారందరికీ నేను చేసిన ద్రోహాలకు.. అపరాధ భావనతో ఏడ్చాను. రెండు రోజుల క్రితం వరకు అహంకారంతో నా కళ్లు నెత్తికెక్కాయి.

నేను  మద్యం తాగి తాగుబోతును కాలేదు. నా సినిమాలు ఇచ్చిన విజయ గర్వం మత్తు ఎక్కింది. నన్ను గుడ్డివాడిని చేసింది. రంగీలా, సత్య సినిమాలా వలన వచ్చిన విజయంలో నా దృష్టిని కోల్పోయాను. దీంతో నాకు నచ్చినట్లు సినిమాలు చేశాను. నా జిమ్మిక్కులతో, టెక్నాలజీతో ప్రేక్షకులను మెప్పించాలని నా అతి తెలివితో అసభ్యకరమైన సన్నివేశాలు జోడించి చాలా సినిమాలు తీసాను. అర్థపర్థం లేని కథలతో  సినిమాలు తీసాను,. ఎన్నో మంచి కథలతో సినిమాలు తీయొచ్చు. నా తరువాతి సినిమాలు కొన్ని విజయవంతమై ఉండవచ్చు కానీ వాటిలో ఏవీ సత్యలో ఉన్నంత నిజాయితీ మరియు చిత్తశుద్ధిని కలిగి ఉన్నాయని నేను నమ్మను.

Shriya Saran : బీచ్ లో బికినీలో తడి అందాలతో హీటేక్కిస్తున్న శ్రీయా శరన్..

ఇండస్ట్రీ నా టాలెంట్ ను చూసింది. ఎన్నో మంచి అవకాశాలు ఇచ్చింది. కానీ, నేను వాటిని ఉపయోగించుకోలేదు. ఇప్పటివరకు నేను చేసినదానికి ఏమి చేయలేను.  కానీ,  రెండురోజుల క్రితం నా  కళ్ల నీళ్లు తుడుచుకొని నాకు నేనే ఒక హామీ ఇచ్చుకున్నాను. ఇప్పటి నుండి నేను తీసే ప్రతి సినిమా దర్శకుడిగా నా గౌరవం పెంచేలా తీస్తాం. నేను మళ్ళీ సత్య లాంటి సినిమా చేయలేకపోవచ్చు, కానీ అలా చేయాలనే ఉద్దేశ్యం కూడా లేకపోవడం సినిమాపై క్షమించరాని నేరం. నేను సత్య లాంటి సినిమాలు చేస్తూనే ఉండాలని నా ఉద్దేశ్యం కాదు.

సత్య తర్వాత నేను తీయబోయే ఏ సినిమా గురించి ఎవరూ నన్ను అడగలేదు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే నన్ను నేను ప్రశ్నించుకోలేదు. ఇకనుంచి నేను ఏ సినిమాతీసినా  దానికి ముందు సత్య సినిమా చూడాలని నిర్ణయించుకున్నాను. నేను ఆ నియమాన్ని పాటిస్తే, అప్పటి నుండి నేను చేసిన 90% సినిమాలు అసలు చేసేవాడిని కాదు అని నాకు కచ్చితంగా తెలుసు. చివరగా ఇప్పుడు నా జీవితంలో ఎంత మిగిలి ఉన్నా, దానిని నిజాయితీగా ఖర్చు చేసి సత్య వంటి విలువైన సినిమాలను తెరకెక్కించాలని  ప్రతిజ్ఞ చేసాను. సత్య సినిమాపై ప్రమాణం చేసి సత్యంగా చెప్తున్నాను” అంటూ ముగించాడు. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు హమ్మయ్య ఇప్పటికైనా గ్రహించవు.. మంచి సినిమాలు తీయ్.. బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×