Big Stories

TS weather: రాష్ట్రంలో భిన్న పరిస్థితులు.. ఓ పక్క ఎండలు.. మరోపక్క వానలు..!

TS weather: భానుడి ప్రతాపానికి తెలంగాణ ప్రజలు గత వారం రోజులుగా అల్లల్లాడిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు నడినెత్తిపైకి రాకముందే 40 డిగ్రీలు దాటేస్తున్నాడు. మరికొన్ని ప్రాంతాల్లో హాఫ్ సెంచరీ దిశగా దూసుకుపోతూ.. ప్రజలను బయటకు రాకుండా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.

- Advertisement -

రాగల ఐదురోజుల పాటు రాష్ట్రంలో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉందని చల్లని కబురు చెప్పింది. శనివారం కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -

ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో తేమతో కూడిని వాతావరణం ఆదివారం నెలకొంటుందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటే అవకాశం ఉందని అన్నారు.

Also Read: ఢిల్లీలో వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో అతి తీవ్ర వడగాలులు.. ఎన్నడూ చూడనంత వేడి తప్పదా ?

రాజన్న సిరిసిల్లా, పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులలో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే సోమవారం నుంచి బుధవారం వరకు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News