BigTV English

TSPSC: బండి అరెస్ట్ వెనుక పొలిటికల్ స్కెచ్?.. కేటీఆర్‌ను సేవ్ చేయడం కోసమేనా?

TSPSC: బండి అరెస్ట్ వెనుక పొలిటికల్ స్కెచ్?.. కేటీఆర్‌ను సేవ్ చేయడం కోసమేనా?
bandi sanjay arrest ktr

TSPSC: టెన్త్ పేపర్ లీక్ అయింది. బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు. నమ్మశక్యంగా లేకున్నా ఇదే నిజం. పేపర్ బయటకు తీసుకొచ్చిన నిందితుడు.. బండి సంజయ్‌కు ఆ పేపర్ వాట్సాప్ చేశాడనేది పోలీసుల ఆరోపణ. ఆ మాత్రానికే అర్థరాత్రి అరాచకంగా బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నాలుగైదు జిల్లాలు తిప్పుతూ నానా హంగామా చేశారు. బీజేపీ కుట్ర చేసి పేపర్ లీక్ చేయించిందంటూ పొలిటికల్ రచ్చ రాజుకుంది.


కాస్త ఆలోచిస్తే.. ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. ఈ చిన్న కేసులో, కేవలం క్వశ్చన్ పేపర్‌ను వాట్సాప్ చేశాడనే కారణంతో.. బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం వెనుక రాజకీయ రీజన్ ఉందని ఎవరికైనా తెలిసిపోతుంది. ఒకవేళ నిందితుడి దగ్గర బీఆర్ఎస్ నేతల ఫోన్ నెంబర్లు ఉండి ఉంటే.. వారికి కూడా వాట్సాప్ చేసుఉంటే.. వారందరినీ అరెస్ట్ చేసి ఉండేవారా? ఏ కేటీఆర్‌కో పేపర్ సెండ్ చేస్తే ఆయన్నూ అరెస్ట్ చేసేవారా? అనేది బీజేపీ ప్రశ్న. అసలది పేపర్ లీక్ కాదని.. పేపర్ బయటకు వచ్చింది అంతేనని మంత్రులు చెప్పగా.. మరి అంతమాత్రానికే ఏకంగా బీజేపీ అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం ఏంటి?

మరెందుకు? ఇంత హడావుడిగా బండి సంజయ్ అరెస్ట్ ఎందుకు? కేవలం గంటల వ్యవధిలో విచారణ ముగించేసి.. వరంగల్ సీపీ ప్రెస్‌మీట్ పెట్టి.. బండి సంజయ్‌పై ఆరోపణలు చేయడం వెనుక వ్యూహం ఉందా? సీపీ ఇలా అన్నారో లేదో.. అలా బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు వరుస స్టేట్‌మెంట్లు ఇస్తూ బండి సంజయ్‌ను దోషిగా చూపించే ప్రయత్నం చేయడంలో రాజకీయ ఎత్తుగడ ఉందా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కావొచ్చు. ఉండొచ్చు.


కొన్నిరోజులుగా TSPSC పేపర్ లీక్ ఘటన తెలంగాణను షేక్ చేస్తోంది. పరీక్ష పేపర్ల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం దారుణం. ఏకంగా కమిషన్ ఉద్యోగులే నిందితులు. ఛైర్మన్, సెక్రటరీ, మెంబర్.. ఇలా అందరినీ సిట్ ప్రశ్నిస్తోంది. ఏకంగా మంత్రి కేటీఆర్ పీఏ హస్తం ఉందంటూ ఆరోపణలు ఉన్నాయి. ఎన్నారైలకూ పేపర్లు అమ్ముకున్నారని అంటున్నారు. నేరుగా కేటీఆర్ టార్గెట్‌గానే విమర్శలు చేస్తున్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఆయన చెప్పినట్టుగానే కేటీఆర్ పీఏ తిరుపతి సొంతూరు మల్యాల మండలంలో ఏకంగా 50 మంది గ్రూప్ 1 క్వాలిఫైడ్ అభ్యర్థులను విచారించింది సిట్. ఈ కేసు మంత్రి కేటీఆర్‌కూ చుట్టుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. TSPSC పేపర్ లీక్ ఘటనలో బీఆర్ఎస్, కేటీఆర్ బాగా బ్లేమ్ అవుతోంది. నిరుద్యోగులు, ప్రజలు సర్కారునే దోషిగా చూస్తున్నారు. ప్రభుత్వం పరువంతా పోయింది. ఇలాంటి సమయంలో.. పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేసేందుకే అన్నట్టుగా.. పదో తరగతి పరీక్ష పత్రం లీకేజీలో నేరుగా బండి సంజయ్‌నే అరెస్ట్ చేయడంపై రాజకీయ కోణం ఉందనే అనుమానం బలపడుతోంది.

ప్రజల దృష్టి TSPSC ఘటన నుంచి పక్కకు తప్పించి.. పదో తరగతి వైపు మరల్చడం.. పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో బీజేపీ ఆడుకుంటోందనేలా ప్రచారం జరపడం.. బండి సంజయ్ అరెస్టుతో మీడియా అటెన్షన్, విపక్షం ఫోకస్ అటువైపు మళ్లేలా చేయడం.. పేపర్ లీక్ కుట్రదారులు కమలనాథులే అనేలా బలమైన మెసేజ్ ఇవ్వడం.. ఇలా వన్ అరెస్ట్.. మెనీ టార్గెట్స్ అనేది ప్రభుత్వం స్కెచ్‌ అంటున్నారు. ఏమో.. ఏది నిజమో.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×