Big Stories

Bandi Sanjay: హెబియస్ కార్పస్ అంటే ఏంటి? బండి సంజయ్ కోసం ఆ పిటిషనే ఎందుకు?

bandi sanjay high court

Bandi Sanjay: ఎక్కడో పదో తరగతి పరీక్ష పత్రం లీక్. ఇంకెక్కడో బండి సంజయ్ అరెస్ట్. అదికూడా అర్థరాత్రి అరాచకంగా అరెస్ట్ చేశారంటూ బీజేపీ భగ్గుమంటోంది. సంజయ్ అరెస్ట్ విషయంలో నిబంధనలు పాటించలేదని మండిపడుతోంది. నోటీసులు ఇవ్వలేదని.. కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదంటూ న్యాయపోరాటానికి సిద్ధమైంది. బండి సంజయ్‌ను వెంటనే హాజరుపరచాలంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేసింది బీజేపీ. ఇంతకీ హెబియస్ కార్పస్ అంటే ఏంటి? బండి సంజయ్ కోసం ఆ పిటిషనే ఎందుకు దాఖలు చేశారు?

- Advertisement -

పౌరుల జీవించే స్వేచ్ఛను కాపాడే విషయంలో హెబియస్ కార్పస్ ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఎవరైనా వ్యక్తి కనిపించకుండా పోతే.. 24 గంటల్లో న్యాయస్థానం ముందు హాజరుపరచాలంటూ పోలీసులకు ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశమే హెబియస్ కార్పస్. అయితే, ఈ ఆదేశాలు ఇచ్చే అధికారం అన్ని కోర్టులకు ఉండదు. హైకోర్టు, సుప్రీంకోర్టుకు మాత్రమే ఈ అధికారం ఉంటుంది. అందుకే, బండి సంజయ్‌ను అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారో తెలీదు కాబట్టి.. ఆయన్ను కోర్టులో హాజరుపరిచేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది బీజేపీ. అయితే, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. గురువారం వాదనలు వింటామని తెలిపింది.

- Advertisement -

అన్యాయంగా అరెస్టైన బాధితులకు తగిన పరిహారాన్ని పొందగలిగే అవకాశాన్ని కూడా హెబియస్ కార్పస్ కల్పిస్తుంది. హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడానికి ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. ఒకరు అన్యాయంగా అరెస్టు అయ్యారని అనిపిస్తే, ఆ వ్యక్తి తరపున ఎవరైనా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వెయ్యవచ్చు. రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ ప్రకారం, ప్రతి వ్యక్తికీ సమాజంలో స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ఈ ఆర్టికల్ ప్రకారం దేశ పౌరులందరి జీవించే హక్కును రక్షిస్తుంది హెబియస్ కార్పస్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News