BigTV English

TSRTC: టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు ప్రారంభం.. ఫ్రీగా వైఫైతో పాటు మరెన్నో సదుపాయాలు

TSRTC: టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు ప్రారంభం.. ఫ్రీగా వైఫైతో పాటు మరెన్నో సదుపాయాలు

TSRTC: టీఎస్‌ఆర్టీసీ మొట్టమొదటి సారి ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బస్సులకు లహరి-అమ్మఒడి అనుభూతిగా పేరుపెట్టారు. సోమవారం ఈ బస్సులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు.


మొత్తం 16 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. నేటి నుంచి ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. తిరుపతి, చెన్నై, వైజాగ్, హుబ్బళ్లి మార్గాల్లో ఈ బస్సులను నడపనున్నారు. 12 మీటర్ల పొడవుండే ఈ బస్సులో లోయర్ 15, అప్పర్ 15 ఇలా మొత్తం 30 బెర్తులు ఉంటాయి. ఇక ఈ బస్సులో ప్రయాణికులకు ఉచితంగా వైఫై అందిస్తున్నారు. అలాగే ప్రతి బెర్త్‌కు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సౌకర్యంతో పాటు రీడింగ్ ల్యాంప్ ఉంటాయి.

ప్రయాణికుల భద్రత కోసం బస్సులో సెక్యూరిటీ కెమెరాలు, ఫైర్ డిటెక్షన్ అలారమ్, పానిక్ బటన్‌తో పాటు బస్సు ట్రాకింగ్ సిస్టం వంటి సదుపాయాలను కల్పించారు.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×