Illu Illalu Pillalu Today Episode September 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. తన ఫ్రెండ్స్ తో సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ప్రేమ.. అయితే అప్పుడే కళ్యాణ్ గాడు ప్రేమకు ఫోన్ చేస్తాడు.. వాడి ఫోన్ చూసి షాక్ అయిన ప్రేమ పక్కకు వెళ్లి మాట్లాడుతుంది. నీకు ఒళ్ళు పగలగొట్టిన బుద్ధి లేదా అని అంటుంది. నీకు వార్నింగ్ ఇచ్చే టైం అయిపోయింది ఇక వార్ లోకి దిగాల్సిందే అని కళ్యాణ్ అంటాడు.. ప్రేమని ఇంకాస్త టెన్షన్ పెట్టేలా కళ్యాణ్ మాట్లాడడంతో ప్రేమ భయపడిపోతుంది. ఎలాగైనా సరే వీడు నుంచి బయటపడాలి అని అనుకుంటుంది. శ్రీవల్లి ప్రేమ గదిలోకి వెళ్లి ఆ రోజు వచ్చిన లెటర్ ఏంటో తెలుసుకోవాలని వెతికేస్తూ ఉంటుంది. ప్రేమ దాచుకున్న ఒక పెట్టెలో ఏమున్నాయో తెలుసుకోవాలని దాన్ని పగలగొడుతుంది. అందులో ఆరోజు వచ్చిన లెటర్ కనిపించడంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. ప్రేమకి ఆరోజు వచ్చిన లెటర్ ఇదే అని దాన్ని తీసుకొని అందులో ఏమున్నాయి అని చూస్తుంది. అయితే అందులో ఉన్న ఫోటోలను చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. ఫోటోలలో ఉన్న అబ్బాయి ఎవరు? సీక్రెట్ ఏదైన నడిపిస్తుందా? ధీరజ్ కి విషయం తెలుసా? అని తనలో తానే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటుంది.. ఆ ఫోటోలను నర్మదా తీసుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నర్మదా ఆ ఫోటోలను తీసుకెళ్లి వేదవతికి చూపిస్తుంది. ఆ ఫోటోలను చూస్తున్నా వేదవతి షాక్ అవుతుంది. ఈ ఫోటోలు ఎక్కడివే.. ఇది మీ మామయ్య కంటపడితే ఇంకా ఏమైనా ఉందా అని నర్మదతో టెన్షన్ పడుతూ మాట్లాడుతుంది. అయితే వీళ్లిద్దరు మాట్లాడుకోవడం విన్న వల్లి అర్థం కాక ఏం జరుగుతుందని జుట్టు పీక్కుంటుంది. అయితే వల్లి ఈ విషయాన్ని ఎలాగైనా తెలుసుకోవాలని అనుకుంటుంది. అత్తయ్య నర్మదా ఏదో విషయం గురించి టెన్షన్ పడుతున్నారు. ఏంటో కచ్చితంగా కనిపెట్టాలి అని అనుకుంటుంది.
రామరాజుకి ఈ విషయం ఎలాగైనా చెప్పాలని కళ్యాణ్ తన ఫ్రెండ్ ని తీసుకుని రామరాజుకి పెన్ డ్రైవ్ ఇవ్వమని చెప్తాడు. మనము ఈ పెన్ డ్రైవ్ ఇస్తే ఆయనే చూసుకుంటాడు మిగతాదంతా అని కళ్యాణ్ అంటాడు. కళ్యాణ్ ఫ్రెండు అనుకున్న విధంగానే ఆ పెన్ డ్రైవ్ ని రామరాజుకు ఇస్తాడు.. అయితే రామరాజు ఇందులో ఏముంది అసలు నువ్వు ఎవరు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. నేను చదువుకుంటున్నాను సార్ వేరే అతని మీకు ఇవ్వమని ఇచ్చారు అందుకే ఇది ఇస్తున్నాను తీసుకోండి అని అక్కడి నుంచి కూడా ఇస్తాడు.
ఆ తర్వాత రామరాజు తిరుపతిని పిలిచి ఇదేంటో తెలుసా అని అడుగుతాడు.. ఇది లాప్టాప్ కి కనెక్ట్ చేసేది నాకెందుకు తెలియదు బావ మా జనరేషన్లో ఇలాంటి ఉండేవి అని అంటాడు. అక్కడే ఉన్నావు ఒక అబ్బాయి లాప్టాప్ తీసుకొని అందులో ఏముందో తెలుసుకోవాలని తిరుపతి అనుకుంటాడు. అయితే తిరుపతి ఆ పెన్ డ్రైవ్ తీసుకొని పిచ్చి ప్రయోగాలు చేస్తాడు. కానీ ఆ కుర్రాడు ఆ పెన్ డ్రైవ్ ని పెట్టి ఇందులో ఏవో ఫైల్స్ ఉన్నాయి సార్ అని అంటాడు. అప్పటికే అది ఓపెన్ అవడంతో ధీరజ్ సడన్గా వచ్చి ఆ లాప్టాప్ ని తీసుకుని పక్కకు వెళ్ళిపోతాడు..
ఏంట్రా ఇది ఆ పెన్ డ్రైవ్ ఏంటి ఏం స్టోరీ రా ఇదంతా అని రామరాజు అడుగుతాడు. నా కాలేజీలో రిజల్ట్స్ కి సంబంధించినవి అని ధీరజ్ ఏదో ఒకటి మేనేజ్ చేస్తాడు. అయితే నువ్వు మంచిగా చదివింటే వాళ్ళు ఎవరో వచ్చి నాకు ఇలా ఇవ్వరు కదా అని తిడతాడు రామరాజు. ఇది నాకు సంబంధించినవే నాన్న నేను బాగానే చదువుతున్నాను అని ఏదో ఒకటి కవర్ చేస్తాడు. ఇక శ్రీవల్లి ఈ విషయాన్ని భాగ్యం ఆనందరావుకి చెప్తుంది. ధీరజ్ ప్రేమ ఇద్దరూ ప్రేమించుకోవడానికి ముందు వేరే వ్యక్తితో ప్రేమలో పడినట్టుంది ఆ వ్యక్తి ఇతను అడు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టున్నాడు అని భాగ్యం అంటుంది.
అమ్మ నీ బుర్ర బుర్ర నే.. కచ్చితంగా ఇదే ఉంటది. ఫోటోలు మీ మామయ్య గారికి కనిపించేలా చూపించు ఆ తర్వాత కదా అదే నడుస్తుంది అని భాగ్యం సలహా ఇస్తుంది. ఇక శ్రీవల్లి కచ్చితంగా ప్రేమను ఇరికించాల్సిందే అని అంటుంది. ఇక ఇంట్లో నర్మదా వేదవతి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ విషయం మీ మావయ్య గారికి ఎట్టి పరిస్థితులను తెలియని ఇవ్వకూడదు అని అనుకుంటారు. ప్రేమ టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. నీ గురించి ఎవరో కాలేజీలో అందరికీ ఫోటోలు పంపిస్తున్నారు నీ పక్కన ఉన్న అబ్బాయి ఫోటో బ్లర్ చేసి కాసేపట్లో రివిల్ అవుతుంది అని చెప్తున్నారు అని ఫ్రెండ్స్ చెప్తారు.
Also Read: అక్షయ్ ను ట్రాప్ చేసిన పల్లవి.. ఫంక్షన్ లో రచ్చ రచ్చ.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..
అయితే ప్రేమ ఈ విషయం ఎలాగైనా ధీరజ్తో చెప్పాలని అనుకుంటుంది.. రామరాజు భోజనానికి ఇంటికి వెళ్లాలని అనుకుంటాడు. ఏమో నువ్వు టెన్షన్ పడుతూ ఉండడం చూసి ఏమైంది ప్రేమ ఇలా పరిగెడుతుంది ఏంటి అని తిరుపతి తో అంటాడు. దానికి తిరుపతి నీ కోడలితో ఏ రోజైనా నువ్వు ప్రేమగా మాట్లాడావు బావ ఏమైంది అమ్మ ఎందుకు ఇలా పరిగెడుతున్నావ్ అని అడిగావా నీకు చెప్పడానికి అని సెటైర్లు వేస్తాడు. ఆ తర్వాత ధీరజ్ కూడా పరిగెత్తడం చూసి రామరాజుకు ఏంటి వీళ్లిద్దరూ టెన్షన్ గా పరిగెడుతున్నారు అని అనుమానం వస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..