Fire accident: కర్నాటక రాజధాని నగరం బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని శ్రీరామ్‌పురలో పోలీసులు సీజ్ చేసిన వాహనాలను పార్క్ చేసి స్థలంలో అగ్నిప్రమాదం జరిగింది. పార్కింగ్ స్థలంలో ప్రమాదవశాత్తూ ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 150 వాహనాలు దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ప్రమాదంలో 130 బైక్‌లు, పది ఆటో రిక్షాలు, పది కారులు దగ్ధమయ్యాయని పోలీస్ అధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. బైక్ బ్యాటరీల్లో మండే పదార్థాలు ఉండడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది..? అనే దానిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
బెంగళూరు నగర పోలీసులు పలు క్రిమినల్ కేసుల్లో 10వేలకు పైగా వాహనాలను సీజ్ చేశారు. ఈ వాహనాలను శ్రీరామ్‌పురలోని రెండ ఎకరాల ఖాళీ స్థలంలో పార్క్ చేశారు. అయితే ఇవాళా ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొత్తం ఒక్కసారిగా మంటలు వ్యాపించి 150 వాహనాలకు అంటుకున్నాయి. దీంతో గమనించిన స్థానికులు, చుట్టు పక్కల ప్రాంత వాసులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ సిబ్బంది రెండు, మూడు గంటలు శ్రమించి మంటలను పూర్తి అదుపు చేశారు. అయితే 1991 ఇదే మైదానంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అప్పుడు జరిగిన ప్రమాదంలో 92 మంది మృతి చెందగా.. 300 మందికి పైగా గాయపడ్డారు.
Also Read: Engine Driver Jobs: కొచ్చిన్ షిప్ యార్డులో ఇంజిన్ డ్రైవర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
అదృష్టావశాత్తూ ఇవాళ బెంగళూరులో జరిగిన ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. సీజ్ చేసిన 150 వాహనాలు మాత్రమే దగ్ధమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎండిన గడ్డి కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా నిజా నిజాలు తెలియాల్సి ఉంది.