E-Paper
Advertisement

అబద్ధాల ప్రచారంలో బీఆర్ఎస్ నంబర్ వన్.. జగదీశ్ రెడ్డికి యెన్నం శ్రీనివాస్ కౌంటర్!

అబద్ధాల ప్రచారంలో బీఆర్ఎస్ నంబర్ వన్.. జగదీశ్ రెడ్డికి యెన్నం శ్రీనివాస్ కౌంటర్!
Advertisement

Telangana Power: అబద్ధాల ప్రచారంలో చేయడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుందని, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని యన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విద్యుత్ రంగాన్ని పదేళ్ల పాటు నాశనం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే, అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టారని ఫైర్ అయ్యారు. విద్యుత్ డిస్కంలకు 80 వేల కోట్లు, నష్టాలు మరో యాభై వేల కోట్లు మిగిల్చి వెళ్లారని ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకువచ్చి సంక్షేమాన్ని అందిస్తున్నామని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

బీఆర్ఎస్ తప్పులు..

అత్యధిక విద్యుత్ డిమాండ్‌ను తట్టుకుని నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసి ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఎల్‌నినో పరిస్థితులు, భవిష్యత్తు అవసరాలు, విద్యుత్ వినియోగం లాంటివి అంచనా వేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంది. ఈఆర్‌సీ ముందు బీఆర్ఎస్ ప్రజలను గందరగోళపరిచే వాదనలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వం నేరుగా సబ్సిడీని రైతు డిస్కంకు ఇస్తే, నేరుగా రైతులకు ప్రయోజనం కలుగుతుందని సింగరేణి ప్రాంతంలో కాకుండా, బొగ్గు లేని ప్రాంతంలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించింది కేసీఆర్ సర్కార్ సిగ్గుచేటని అన్నారు. సింగరేణి బొగ్గును కాదని, విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని కేసీఆర్ సర్కార్ చూసిందని అన్నారు.

Advertisement

Also Read: పరిషత్ ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ ల‌క్ష్యం.. కూటమి నేతలతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్

కరోనా వల్ల..

దేశీయ బొగ్గును తక్కువ ధరకు కొనుగోలు చేయడం కోసం మా ప్రభుత్వం నైనీ బ్లాక్ నుంచి తీసుకువస్తున్నాం. వాస్తవాలు చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ విధానం. వాస్తవాలు దాచి ప్రజలను మభ్యపెట్టడం బీఆర్ఎస్ ప్రభుత్వ విధానం అని యెన్నం శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. పారాసిటమాల్ టాబ్లెట్లు వేసుకుంటే కరోనా మాడి మసి అవుతుందని చెప్పిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదని ఎద్దేవా వేశారు. కరోనా మహమ్మారిని ఆనాడు సమర్థవంతంగా ఎదుర్కోకపోవడం వల్ల అనధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ‌లో లక్ష మంది చనిపోయారు. కేసీఆర్ అజాగ్రత్త వల్లనే ఈ మరణాలు జరిగాయని అన్నారు. ఎల్‌నినోపై మా ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తుంటే, బీఆర్ఎస్ మాత్రం తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు.

భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్..

Advertisement

వర్షాలు సరిగా కురవక, భూగర్భ జలాలు లేక 15 లక్షల పంపుసెట్లపై ప్రభావం పడింది. ఫలితంగా విద్యుత్ డిమాండ్ బాగా పెరిగింది. అదనంగా 7,800 మెగావాట్ల విద్యుత్ అవసరమని విద్యుత్ డిస్కంలు అంచనా వేసి ప్రణాళికలు ఇచ్చాయి. లోడ్ అధికంగా కావడంతో విద్యుత్ లైన్లు దెబ్బతింటున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ బాగా పెరుగుతుంది. దేశంలోని డేటా సెంటర్లలో 23 శాతం హైదరాబాద్‌కు వస్తున్నాయి. వీటికి నీళ్లు, విద్యుత్ అవసరం. గత ప్రభుత్వం ఒక్క అదనపు థర్మల్ పవర్ ప్లాంట్‌ను నిర్మించలేదని పీక్ డిమాండ్ సమయంలో 15 రూపాయలకు యూనిట్ విద్యుత్‌ను గత ప్రభుత్వం కొనుగోలు భారం పెట్టిందిని, వేల కోట్ల రూపాయలను దుబారా చేశారని ఫైర్ అయ్యారు.

Also Read: లెజెండ్ సినిమాపై రాధిక ఆప్టే కామెంట్స్.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన ఎస్కేఎన్!

Tags

Related News

మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి!

ఆగమైతున్న హైదరాబాద్.. నిరసన పేరిట వేల లీటర్ల నీరు వృథా.. రగిలిపోతున్న ప్రజలు!

సదర్ సమ్మేళనంలో.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనలు!

హైదరాబాద్ ED బిగ్ ఆపరేషన్.. అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ గుట్టురట్టు!

మల్కాజిగిరిలో చెత్త సమస్యలకు చెక్.. ఎంఎంసీ కమిషనర్ సంచలన నిర్ణయాలు!

ఎంపీలో తెలంగాణ యువతి ఆత్మహత్య.. బీటెక్ థర్డ్ ఇయర్, వెలుగులోకి షాకింగ్ విషయాలు,

చిల్లర వివాదం.. మహిళా కండక్టర్ మృతి.. నిందితురాలిపై హత్య కేసు నమోదు!

Big Stories

Advertisement
×