Petrol Bunk Explosion: హైదరాబాద్ లో మరోసారి పేలుడు కలకలం రేపింది. రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధిలోని.. అత్తాపూర్ పెట్రోల్ బంక్‌లో పేలుడు సంభవించింది. వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వులు.. పెట్రోల్ బంక్‌లో పడటంతో ఈ ప్రమాదం చేటుచేసుకుంది. మెట్రో పిల్లర్ నెంబర్-136 దగ్గర ఉన్న పెట్రోల్ బంక్‌లో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది.
సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్భంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. మంటలు ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు సంభవించడంతో చుట్టు ప్రక్కల ఉన్నవారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో.. పెను ప్రమాదమే తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని నారాయణగూడ ఎక్సెల్ హాస్పిటల్‌లో.. గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐదు ఫ్లోర్స్ గల బిల్డింగ్‌లో మొదటి అంతస్తులో హాస్పిటల్ ఉండగా.. ఐదవ అంతస్తులో డాక్టర్స్ ఫ్యామిలీ ఉంటున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదటి ఫ్లోర్‌లోని హాస్పిటల్‌లో మంటలు చెలరేగాయి.
Also Read: బాంబుల వర్షం.. శవాల కుప్పలు.. మూడో ప్రపంచ యుద్దం మొదలైనట్లే
ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్‌లో ఐదుగురు పేషెంట్స్ ఉన్నారు. హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తంతో పేషెంట్స్, డాక్టర్ ఫ్యామిలీ మెంబర్స్ కిందికి దిగారు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని మంటలు పై అంతస్తుకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు.