BigTV English

Radisson Hotel Drug Case: రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితులు అరెస్ట్.. రూ. కోటి విలువైన కారు స్వాధీనం..

Radisson Hotel Drug Case: రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితులు అరెస్ట్.. రూ. కోటి విలువైన కారు స్వాధీనం..
Radisson Hotel Drug Case
Radisson Hotel Drug Case

Radisson Hotel Drug Case Updates (Telangana today news): రాడిసన్ హోటల్ కేంద్రంగా సాగిన డ్రగ్స్ సరఫరా కేసులో పోలీసులు పురోగతి సాధించారు.ఇద్దరు కీలక నిందితులు సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్, నరేంద్ర శివనాథ్ ను అదుపులోకి తీసుకున్నారు. రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ సరఫరాపై ఫిబ్రవరి 25న కేసు నమోదైంది. ఈ ఇద్దరూ నిందితులు డ్రగ్స్ సరఫరా చేశారని పోలీసులు గుర్తించారు. రెహ్మాన్ పై 6 కేసులున్నాయి. అతడు 3 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు.


తాజాగా రెహ్మాన్ తోపాటు నరేంద్ర శివనాథ్ ను మదాపూర్, గచ్చిబౌలి ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. కోటి విలువైన కారు, 7 ఫోన్లు, 11 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నామని మాదాపూర్ డీసీపీ వినీత్ ప్రకటించారు. కొకైన వినియోగించిన వ్యక్తల రక్త నమూనాలను మెడికల్ టెస్టులకు పంపామని తెలిపారు. నిందితులకు క్రొమొటోగ్రఫీ టెస్ట్ చేయించేందుకు కోర్టు పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వాడు. 2021 డ్రగ్స్ వ్యవహారాల ప్రారంభించాడు. ఈ సమయంలోనే హైదరాబాద్ కే చెందిన ఉస్మాన్ తో జతకట్టాడు. ఉస్మాన్ డ్రగ్స్ కోసులో ప్రస్తుతం గోవా కొల్వాలే జైలులో ఉన్నాడు. జైలు నుంచి కూడా అతడు డ్రగ్స్ దందా చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఉస్మాన్ ద్వారానే రెహ్మాన్ డ్రగ్స్ హైదరాబాద్ కు తెప్పించేవాడని పోలీసుల గుర్తించారు. ఉస్మాన్ డ్రగ్స్ ను ఢిల్లీకి కూడా సరఫరా చేయించేవాడని నిర్ధారించారు. రెహ్మాన్ అనుచురుడు ఢిల్లీకి చెందిన నరేంద్ర శివనాథ్ ఆ డ్రగ్స్ ను తీసుకుచ్చేవాడని తేలింది. రెహ్మాన్ , శివనాథ్ కలిసి ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్మేవారని గుర్తించారు. ఈ నెట్ వర్క్ నడిపేందుకు మొత్తం 15 మందిని పెట్టుకున్నారని పోలీసుల విచారణలో తేలింది.


Also Read : చీకట్లోకి ఆ ఐకానిక్ కట్టడాలు.. హైదరాబాద్‌లో ఎర్త్ అవర్..

పబ్స్ నే టార్గెట్ చేస్తూ రెహ్మాన్ తన డ్రగ్స్ దందా సాగించాడు. యువతకు డ్రగ్స్ అమ్మేవారు. ఈ సమయంలో సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ పై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 6 కేసులు నమోదయ్యాయి. అలాగే డ్రగ్స్ బానిసైన ఓ యువతితో ఈ దందా చేయించిన వ్యవహారంలో రెహ్మాన్ పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

రాడిసన్ హోటల్ లో మంజీరా గ్రూప్ డైరెక్టర్ గజ్జల వివేకానంద, ఆ గ్రూప్ మాజీ ఉద్యోగి సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీ డ్రగ్స్ పార్టీ నిర్వహించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు. అత్తాపూర్ కేఫ్ రెస్టారెంట్ లో పనిచేస్తున్ మీర్జా వహీద్ బేగ్ డ్రగ్స్ పంపించాడని వారు తెలిపారు. మీర్జాను పోలీసుల ప్రశ్నించడంలో అసలు లింకు బయటపడింది. ఈ నేపథ్యంలో కీలక సూత్రధారులు రెహ్మాన్ , శివనాథ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×