
Bonalu : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజ తర్వాత ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలతోపాటు బోనం సమర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. మహంకాళికి ప్రత్యేక పూజలు చేశారు.

వేకువ జాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించుకుంటున్నారు. మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆషాఢమాస జాతరలో భాగంగా ఆదివారం బోనాలు సమర్పణ కొనసాగుతోంది. సోమవారం రంగం కార్యక్రమం నిర్వహిస్తారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీహెచ్‌ఎంసీ, విద్యుత్, జలమండలి, ఆర్ అండ్ బీ శాఖల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహంకాళి దేవాలయాన్ని విద్యుద్దీపాలు, పూలు, పండ్లతో అలంకరించారు.