BigTV English

Car repairs: కాస్ట్‌లీగా మారుతున్న కారు రిపేర్లు.. ఇవే కారణాలు..!

Car repairs: కాస్ట్‌లీగా మారుతున్న కారు రిపేర్లు.. ఇవే కారణాలు..!

Car repairs: కారు బ్రేక్ డౌన్ అయ్యిందంటే కచ్చితంగా చాలా ఖర్చుకు సిద్ధంగా ఉండాల్సిందే అంటున్నారు నిపుణులు. గత కొన్నేళ్లలో ఆటోమొబైల్ రిపేర్లకు అయ్యే ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా కార్ల విషయంలో అయితే ఈ ఖర్చు మరికాస్త అధికంగానే ఉంది. లగ్జరీ కార్ల విషయంలో అయితే.. రిపేర్ రేటు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ పరిస్థితికి కారణాలు ఏంటి అని వారు శోధించడం మొదలుపెట్టారు.


ఇప్పటికే అమెరికాలోని ఆటోమొబైల్ రంగంలో ఇన్‌ఫ్లేషన్ కనిపిస్తోంది. ఇక రిపేర్ల కోసం ఎక్కువ ఖర్చు చేయడం అనేది ఈ పరిస్థితి మరింత దారుణంగా మారుస్తుంది. దీనికి పలు కారణాలు ఉన్నాయని వారు చెప్తున్నారు. మెకానిక్స్ రంగంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు షార్టేజ్ ఉందని నిపుణులు చెప్తున్నారు. మెకానిక్స్, స్పేర్ పార్ట్స్.. ఇలా ప్రతీదానిలో షార్టేజ్ ఉందని తెలిపారు. ఈ షార్టేజ్ కారణంగా ప్రతీదానికి ధరలు కూడా పెరుగుతున్నాయని అన్నారు. ప్రతీ ఏడాది కారు రిపేర్లకు అవుతున్న ఖర్చులు 19.7 శాతం పెరుగుతుందని చెప్పారు.

కొత్త కొత్త కార్లు ఎప్పటికప్పుడు అమెరికాలో లాంచ్ అవుతున్నా కూడా వాటి ధరలు చూసి చాలామంది అమెరికన్లు కొత్త కార్లు కొనడానికి ముందుకు రావడం లేదు. దీంతో పాత కార్ల సర్వీస్ పీరియడ్ కూడా అయిపోతోంది. అలా సర్వీస్ అయిపోయిన కార్లను రిపేర్ చేయించుకోవాలనే ప్రయత్నంలో కూడా వారిపై అదనపు భారం పడుతుందని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా కొత్త కార్ల విషయంలో కూడా డీలర్‌షిప్స్ అనేవి కాస్ట్‌లీ అయ్యాయని బయటపెట్టారు.


రిపేర్లకు సిద్ధంగా ఉన్న కార్ల సంఖ్య పెరగడం, మెకానిక్స్ సంఖ్య తగ్గడంతో కస్టమర్లకు ఎదురుచూసే సమయం కూడా పెరిగిపోతోంది. రిపేర్ కోసం అపాయింట్‌మెంట్ తీసుకున్నా కూడా వెయిటింగ్ అనేది తప్పడం లేదు. అమెరికాలో ప్రస్తుతం లగ్జరీ కార్ల రిపేర్లకు అపాయింట్‌మెంట్ తీసుకున్నా కూడా వెయిటింగ్ టైమ్ 5 నుండి 6 రోజులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇతర ప్యాసెంజర్ కార్లకు కనీసం 4 నుండి 8 రోజులు ఉంటుందని తెలుస్తోంది. 2021 వరకు ఈ వెయిటింగ్ టైమ్ చాలా తక్కువగా ఉండేది. రెండేళ్లలో ఇందులో చాలా వ్యత్యాసం వచ్చిందని నిపుణులు చెప్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×