
Uttam kumar reddy latest news(TS politics):
ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఇటీవల రెగ్యులర్‌గా న్యూస్‌లో ఉంటున్నారు. తన దగ్గరి బంధువు కౌశిక్‌రెడ్డిని కారెక్కించింది ఆయనే అంటారు. ఉత్తమ్ సైతం కాంగ్రెస్ పార్టీని వీడి.. బీఆర్ఎస్‌లో చేరబోతున్నారని ప్రచారం జరిగింది. ఆ న్యూస్‌ను ఖండించారు. ఉత్తమ్‌కు కీలకమైన అభ్యర్థుల ఎంపిక కమిటీలో స్థానం కల్పించి.. ఆయన ప్రాధాన్యతను పెంచింది అధిష్టానం. అయినా, మళ్లీ కాంట్రవర్సీకి కేరాఫ్‌గానే మారుతున్నారు.
తన కుటుంబానికి రెండు సీట్ల కోసం గట్టిగా పట్టుబడుతున్నారు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. తనకు హుజూర్‌నగర్, ఆయన భార్యకు కోదాద టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఒకే కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వడం ఇబ్బందికర విషయమని ఎంపిక కమిటీలో వాదోపవాదనలు కూడా జరిగాయి.
లేటెస్ట్‌గా మీడియాతో చిట్‌చాట్‌లోనూ అదే అంశం ప్రస్తావించారు ఉత్తమ్. తమకు హుజూర్‌నగర్, కోదాడి స్థానాలు ఇవ్వాల్సిందేనని.. ఆ రెండు సెగ్మెంట్లలో మెజారిటీ 50 వేలకు తగ్గితే ఇక రాజకీయాలు చేయనని అన్నారు.
తనను పార్టీ పోటీ చేయొద్దని ఆదేశిస్తే చేయనని చెప్పారు. ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా బరిలో దిగాలనే ప్రతిపాదన వస్తే అప్పుడు చూద్దామని అన్నారు. గత ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ బాగా బలపడిందని.. టికెట్లు తొందరగా ప్రకటిస్తే ప్రచారవేగం పెంచుతామని చెప్పారు. అంగబలం, అర్థబలంలో బీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొంటామని.. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలను క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.
బీఆర్ఎస్‌పై ప్రజలకు విపరీతమైన కోపం ఉందని.. ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేయలేదని.. అహంకారమే వారిని గద్దె దించబోతోందని అన్నారు ఉత్తమ్. తెలంగాణలో ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. కాంగ్రెస్ వస్తే పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు.