E-Paper
Advertisement

భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో దగ్ధమైన 15 షాపులు, నల్గొండ జిల్లాలో ఘటన

భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో దగ్ధమైన 15 షాపులు, నల్గొండ జిల్లాలో ఘటన
Advertisement

Massive fire: నల్గొండ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చెర్వుగట్టు గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 15 షాపులు మంటల్లో అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో రెండు గ్యాస్‌ సిలిండర్లు పేలినట్లు స్థానికులు చెబుతున్నారు. అసలేం జరిగింది?

నల్గొండ జిల్లాలో ఘటన ఘోర అగ్నిప్రమాదం-నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో పుణ్యక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి. శనివారం అర్ధరాత్రి సమయంలో గుట్ట కింద  భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఏం జరిగిందో తెలీదుగానీ ఒక్కసారి బొమ్మల షాపులో మంటలు చెలరేగాయి. తొలుత చిన్నగా మొదలైన మంటలు క్రమంగా సమీపంలోని షాపులకు వ్యాపించాయి.

Advertisement

మంటల్లో దగ్ధమైన 15 షాపులు- 17 షాపులు, 15 తోపుడు బండ్లను మంటలు చుట్టిముట్టాయి. అగ్నికి అవన్నీ ఆహుతయ్యాయి. దీనికితోడు గాలి మొదలుకావడంతో  పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రతకు సమీపంలోని ఓ షాపులో రెండు గ్యాస్‌ సిలిండర్లు పేలినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో గ్రామ పంచాయతీ ఆఫీసుకు సైతం మంటలు వ్యాపించాయి.

పంచాయతీ ఆఫీసును తాకిన మంటలు-కార్యాలయంలోని పలు దస్త్రాలు కాలిపోయినట్టు సమాచారం. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే మూడు ఫైర్‌ ఇంజిన్లు అక్కడికి చేరుకున్నాయి. చివరకు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. దాదాపు రూ.2.5 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ వెల్లడించాడు.

Advertisement

రంగంలోకి దిగిన పోలీసులు, గ్రామస్థులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి వేళ ప్రమాదం జరగడం.. ఆ సమయంలో దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు? ఘటన ఎలా జరిగింది? అనేదానిపై పరిశీలన చేస్తున్నారు.

ALSO READ: జూరాల ప్రాజెక్టుకు దూసుకొస్తున్న కృష్ణమ్మ.. 8 గేట్లు ఎత్తివేత!

Related News

పోలీస్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఈ న్యూస్ మీకోసమే

పెద్ద కూతురు పెళ్లి కోసం.. కన్న బిడ్డను అమ్ముకోవాలనుకున్న తల్లి.. ఎక్కడంటే?

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. అసెంబ్లీకి ఇద్దరు సీనియర్ నేతలు దూరం?

సిటీలో స్వచ్ఛమైన నీటిలో గణేష్ నిమజ్జనం చేయాలనుకుంటున్నారా.. అయితే ఇక్కడికి రండి?

తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ వయోపరిమితి పెంపు అప్డేట్.. సీఎం హమీ?

సంగారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో కొత్త జోష్.. కమిటీలను ప్రకటించిన జగ్గారెడ్డి!

విధులకు రాకుండానే జీతాలు డ్రా.. కనుకులగిద్దే పల్లె దవాఖానలో అక్రమ డిప్యూటేషన్ దందా!

ఉన్మాదుల్లా ప్రవర్తించారు.. BRSపై రేవంత్ రెడ్డి ఫైర్

Big Stories

Advertisement
×