E-Paper
Advertisement

తెలంగాణ బీజేపీలో మార్పుల పర్వం.. త్వరలోనే కొత్త అధ్యక్షుల నియామకం?

తెలంగాణ బీజేపీలో మార్పుల పర్వం.. త్వరలోనే కొత్త అధ్యక్షుల నియామకం?
Advertisement

BJP Revamp: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ బీజేపీలో పార్టీ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించని జిల్లా అధ్యక్షులపై అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. పనితీరు ఆశించిన స్థాయిలో లేని జిల్లా అధ్యక్షులపై హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. జిల్లాల్లో పార్టీని చురుగ్గా నడిపించలేని అధ్యక్షులను మార్చే దిశగా పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతంతో పాటు క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ లో దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

తొలుత ముఖ్య నేతలతో..

బేగంపేట హరితప్లాజాలో మూడు కీలక సమావేశాలను వారు నిర్వహించారు. అందులో తొలుత బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ మీటింగులో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా వెళ్లాలనే ఎజెండాపై రాష్ట్ర జీహెచ్ఎంసీ ఎన్నికల ఇంచార్జీ రేఖా శర్మ, చంద్రశేఖర్ తివారీతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్​మణ్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్ తో చర్చించినట్లు తెలుస్తోంది. ఆపై గ్రేటర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధి ఎంపీలు, 8 జిల్లాల అధ్యక్షులు, ఖమ్మం, వరంగల్ జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జీలతో భేటీ అయ్యారు. చివరకు రాష్ట్ర పదాధికారులతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ సమావేశమై పలు అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో..

Advertisement

తెలంగాణలో కాషాయ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే పార్టీలో ఎలాంటి గ్రూపు రాజకీయాలను సహించబోమని, వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి అందరూ ఒకే జట్టుగా పనిచేయాలని స్పష్టం చేసినట్లు సమాచారం. భవిష్యత్ లో రాబోయే ఐదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాషాయ పార్టీ అన్ని మేయర్ స్థానాలను కైవసం చేసుకోవాలని స్పష్టంచేసినట్లు సమాచారం. అందుకు కావల్సిన వ్యూహరచనపై గతంలో అక్కడ పోటీ చేసిన నాయకుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని స్పష్​టంచేసినట్లు సమాచారం.

Also Read: Chiranjeevi: గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబానికి అండగా మెగాస్టార్!

చేరికల్లో జోరు..

Advertisement

వారి సలహాలు, సూచనలు తీసుకుని గౌరవించాలని, వారిని కూడా పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించినట్లు తెలిసింది. అలాగే పార్టీ బలోపేతంలో ముఖ్య భాగమైన చేరికల్లో జోరు పెంచాలని సూచించినట్లు టాక్. పార్టీలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని స్థాయిల నాయకులను చేర్చుకోవాలని, ఆ తర్వాత వారిని కలుపుకుని ముందకు వెళ్లాలని, ఇతర పార్టీల నుంచి చేరే నాయకులకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించాలని ఆదేశించినట్లు తెలిసింది. వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమనే భావనతో ప్రతి నాయకుడు వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం.

ప్రజా వ్యతిరేక విధానాలు..

రాష్ట్రంలో జరగనున్న ఐదు మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకునేలా వ్యూహాత్మకంగా పనిచేయాలని సూచించినట్లు తెలిసింది. బూత్ స్థాయి నుంచి సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజల్లో పార్టీ బలాన్ని పెంచే కార్యక్రమాలపై దృష్టి సారించాలని పేర్కొన్నట్లు సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజకీయ పోరాటాలను మరింత ఉధృతం చేయాలని సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇరుకున పెట్టాలనే ప్లాన్..

ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకత్వం సూచించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరుకున పెట్టాలని పిలుపునిచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు, విఫలమైన హామీలపై రాబోయే 3 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు సమాచారం. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 3వ తేదీలోగా పూర్తి చేయాల్సిన ఇంటింటి ఓటర్ల సర్వే, సరిచూసే పనిని సమర్థవంతంగా పూర్తి చేయాలని నేతలకు సూచించినట్లు తెలిసింది.

Also Read: వైఎస్ షర్మిలకు ఆపరేషన్.. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్, అన్నయ్య వచ్చారా?

అసంతృప్తి వ్యక్తం..

రాష్ట్ర పదాధికారుల పనితీరుపైనా సునీల్ బన్సల్, అభయ్ పాటిల్.. అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కొంతమంది ఆఫీస్ బేరర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, పదవులు తీసుకుని క్రియాశీలకంగా పనిచేయకపోవడం సరికాదని హెచ్చరించినట్లు తెలిసింది. ఇకపై ప్రతి పదాధికారి తాను ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు?, పార్టీ కోసం ఏం చేశాడన్న వివరాలను సమీక్షిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. వచ్చే సమావేశంలో ప్రతి పదాధికారి తన పనితీరు నివేదికను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టంచేసినట్లు సమాచారం.

వీడియో కాన్ఫరెన్స్..

ఇదిలా ఉండగా ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై ఆదివారం జిల్లా అధ్యక్షులతో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్ పాటిల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. జిల్లా అధ్యక్షులకు సంస్థాగత బలోపేతం, సమన్వయం, సభ్యత్వ విస్తరణ, ప్రజా ఉద్యమాలు, రానున్న ఎన్నికల సన్నద్ధతపై స్పష్టమైన కార్యాచరణను వివరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అధిష్ఠానం వరుసగా సంస్థాగత చర్యలు చేపడుతుండటంతో తెలంగాణ బీజేపీలో రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: రూ.3వేలలోపు బెస్ట్ ఫిట్‌నెస్ వాచ్ కావాలా? దీని కంటే బెస్ట్ ఉండదు

Related News

మరో పథకాన్ని పున:ప్రారంభించిన కాంగ్రెస్ సర్కార్.. రూ. 20 వేల ఆర్థిక సహయం!

కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం.. స్కూటర్‌ను ఢీకొట్టిన లారీ, ఇద్దరు యువకులు మృతి!

Medchal: మేడ్చల్ బస్టాండ్‌కి వెళ్లాలంటే ముక్కు మూయాల్సిందే.. ఎందుకో తెలుసా..!

పెద్ది సుదర్శన్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత.. వరంగల్‌కు కేటీఆర్, హరీష్‌రావు

భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో దగ్ధమైన 15 షాపులు, నల్గొండ జిల్లాలో ఘటన

ఎవరికి తల వంచం.. ఎవరి ఫేవర్ తీసుకోం: ‘బిగ్ టీవీ’ గ్రూప్ ఛైర్మన్ వెన్నం విజయ్‌రెడ్డి

Jurala Inflow: జూరాల ప్రాజెక్టుకు దూసుకొస్తున్న కృష్ణమ్మ.. 8 గేట్లు ఎత్తివేత!

Big Stories

Advertisement
×