BigTV English

Medaram Jathara: వనదేవతల వనప్రవేశం.. చిలకల గుట్టకు సమ్మక్క.. కన్నెపల్లి ఆలయానికి సారలమ్మ..

Medaram Jathara: వనదేవతల వనప్రవేశం.. చిలకల గుట్టకు సమ్మక్క.. కన్నెపల్లి ఆలయానికి సారలమ్మ..

Medaram Jathara


Medaram Jathara: నాలుగు రోజులు అట్టహాసంగా సాగిన మేడారం సమ్మక్క సారక్క జాతర ముగిసింది. వనం నుంచి వచ్చిన దేవతలను రాత్రి తిరిగి వన ప్రవేశం చేశారు. అమ్మలు వనానికి చేరే సమయంలో చిరుజల్లులు ఆహ్వానం పలికాయి.  జాతర ప్రాంగణంలో విద్యుత్ దీపాలను ఆర్పేసి.. వెన్నెల కాంతిలో గద్దెల వద్ద తుది పూజలు సాంప్రదాయ పద్దతిలో పూజారులు నిర్వహించారు. ఈ ఘట్టంతో మహాజాతర పరిసమాప్తం అయ్యింది.

పూజల అనంతరం  వనదేవతల వన ప్రవేశం మొదలయ్యింది. అనంతరం సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి, పగిడిద్దరాజును మహబూబబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయ్ గ్రామానికి పూజారులు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ప్రక్రియతో జాతర ముగిసింది. అయితే ఈక్రతువును చూడాడానికి లక్షలాది మంది భక్తులు ఈ ఒక్క రోజే మేడారానికి పోటెత్తి వెళ్లారు. ఇలా భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు.


Read More: ధరణి సమస్యలను త్వరగా పరిష్కరించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం..

ఈ మూడు రోజులు వనదేవతలను దర్శించుకున్న భక్తులు చివరి ఆఖరి ఘట్టాన్ని తమ మదిలలో చెరగని ముద్రలా వేసుకున్నారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుడా పోలీసు శాఖ బందోబస్తు నిర్వహించింది.

 

Tags

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×