E-Paper
Advertisement

BJP list: ఒకే సారి 100 మంది అభ్యర్థుల ప్రకటన.. ఫస్ట్ లిస్ట్ సిద్దం చేస్తున్న బీజేపీ..

BJP list:  ఒకే సారి 100 మంది అభ్యర్థుల ప్రకటన.. ఫస్ట్ లిస్ట్ సిద్దం చేస్తున్న బీజేపీ..
Advertisement

BJP list

First list of BJP candidates: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించకముందే.. లోక్ సభకు పోటీ చేయబోయే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్దమవుతోంది బీజేపీ. తొలి విడతగా 100 మందితో జాబితాను వచ్చేవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఫ్రిబ్రవరి 29న భేటీ కానుంది. అదే రోజు తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. వారణాసి నుంచి రెండు సార్లు పోటీ చేసి గెలుపొందిన మోదీ.. మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లు సమాచారం .

2019 ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి గెలుపొందిన అమిత్ షా.. మరో సారి అక్కడి నుంచే బరిలో దిగే అవకాశం ఉంది. మార్చి 10 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.

Advertisement

Read More: పీఎం మోదీపై ఏఐ టూల్ “జెమిని” వివాదాస్పద సమాధానం.. గూగుల్‌ రియాక్షన్‌ ఇదే..

సార్వత్రిక ఎన్నకల్లో ఒంటరిగానే 370 సీట్లు సాధించాలని బీజేపీ ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా ఎన్డీయే కూటమి 400 సీట్లలో విజయం సాధించే దిశగా ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రాబోయే వంద రోజులు చాలా కీలకమని ప్రధాని మోదీ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఇటీవల దిశానిర్ధేశం చేశారు. కాబట్టి ప్రతి కొత్త ఓటరును చేరుకోవాలని, ప్రతి ఒక్కరి నమ్మకాన్ని చూరగొనాలని సూచించారు.

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×