BigTV English

NBK: పదవి చూసుకొని నీకు పొగరేమో.. బోర్డు మీద పేరు మారుతుందేమో.. బాలయ్య డైలాగ్స్ జగన్ మీదేనా!?

NBK: పదవి చూసుకొని నీకు పొగరేమో.. బోర్డు మీద పేరు మారుతుందేమో.. బాలయ్య డైలాగ్స్ జగన్ మీదేనా!?

NBK: వీరసింహారెడ్డి. ఒంగోలులో వీర విహారం. ప్రీ రిలీజ్ ఫంక్షన్ అదుర్స్. బాలయ్య స్పీచ్ బెదుర్స్. ఒంగోలు గిత్తలా.. ఫుల్ హుషారుగా కనిపించిన బాలయ్య జోష్ అన్ స్టాపబుల్. అది సినిమాల్లోనైనా. రాజకీయాల్లోనైనా.


వీరసింహారెడ్డి థియేటర్ ట్రైలర్ కేక పెట్టిస్తోంది. బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో.. పక్కా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో.. తమన్ మ్యూజిక్ తో ట్రైలర్ దుమ్ము రేపుతోంది. కత్తులు, కార్లు, యాక్షన్ సీన్లు.. అన్నీ ఇంకో లెవల్ లో ఉన్నాయి. మరి, బాలయ్య సినిమా అన్నాక.. అందులో పంచ్ డైలాగ్స్ లేకుండా ఉంటాయా? అదికూడా జగన్ ను, వైసీపీ సర్కారును పరోక్షంగా ఏదో ఒకటి అనకుండా ఉంటారా?

అనేశారు. ఈసారి కూడా జగన్ కు పంచ్ డైలాగ్ ఇచ్చేశారు. ప్రస్తుత ప్రభుత్వ తీరుపై తనదైన చురుక్కులు అంటించారు. ట్రైలర్ లో రెండు డైలాగ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఎప్పటిలానే పొలిటికల్ రచ్చ రాజుకుంది.


“పదవి చూసుకొని నీకు పొగరేమో.. బై బర్త్ నా డీఎన్ఏ కే పొగరెక్కువా”.. ఇదీ బాలయ్య నోటి నుంచి వచ్చిన ఓ డైలాగ్. ఇక్కడ పదవి.. పొగరు.. అని ఎవరిని ఉద్దేశించి ఆ డైలాగ్ పెట్టాలో వేరే చెప్పనవసరం లేదంటున్నారు. సోషల్ మీడియాలో అది జగన్ గురించే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక, ఇటీవల వివాదాస్పదమైన మరో ఉదంతంపైనా వీరసింహారెడ్డి పంచ్ లు పేల్చారు. “సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు..మార్చలేదు”.. ఇదీ అసలైన డైలాగ్. ఇది అదేనంటూ టాక్ మొదలైంది.

ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చింది ఏపీ ప్రభుత్వం. ఎన్టీఆర్ పేరు తీసేసి.. హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టింది. యూనివర్సిటీని స్థాపించిన ఎన్టీఆర్ పేరును తీసేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా, జగన్ సర్కారు వెనక్కి తగ్గలేదు. ఆ విషయాన్నే పరోక్షంగా ప్రస్తావిస్తూ.. వీరసింహారెడ్డిలో డైలాగ్ వదిలారని అంటున్నారు. “సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు.. మార్చలేదు”. ఇదీ కదా బాలయ్య పంచ్ అంటే.. అంటూ సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×