E-Paper
Advertisement

వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడిన బస్సు, నలుగురు మృతి

వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడిన బస్సు, నలుగురు మృతి
Advertisement

Vikarabad bus accident: వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అంత్యక్రియలకు బంధువులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అనంతగిరి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఇరవై మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డట్టు తెలుస్తోంది.

ఇస్నాపూర్‌లో వెల్డింగ్ పని చేస్తూ.. మృతి చెందిన ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బంధువులు ప్రైవేట్ బస్సులో బయలుదేరారు. పటాన్‌చెరు మండలం క్యాసారం గ్రామం నుంచి ధారూర్ మండలం చింత కుంటకు వెళ్తున్న ఈ బస్సు.. అనంతగిరి ఘాట్ రోడ్డు వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి పడిపోయింది.

డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?

Advertisement

ప్రాథమిక సమాచారం ప్రకారం.. అనంతగిరి ఘాట్ దిగాక వచ్చే మూల మలుపు వద్ద డ్రైవర్ బస్సును న్యూట్రల్‌లో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో, డ్రైవర్ వెనకాల కూర్చున్న ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో కేకలు వేశారు.

స్థానికుల సహాయక చర్యలు:

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. లోయలో పడిపోయిన బస్సులో నుంచి క్షతగాత్రులను బయటకు తీసేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. సుమారు 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఉన్న వికారాబాద్ పరిసర ఆసుపత్రులకు తరలించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు.

సీఎం దిగ్భ్రాంతి:

Advertisement

ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడిన దుర్ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే.. గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Related News

‘గణేష్ నిమజ్జనం అయ్యింది.. ఇక జ్ఞానేష్ నిమజ్జనమే’.. ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్!

మెట్రోలో మంత్రుల సందడి.. ప్రయాణికులతో మాటామంతి.. ఆర్టీసీ-మెట్రో పాస్‌పై ఆరా!

దిల్‌సుఖ్‌నగర్ ఆలయంపై దాడి.. రేవంత్ సర్కార్‌పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణలో క్రీడా విప్లవం.. అంతర్జాతీయ స్థాయి శిక్షణకు సర్కార్ ప్లాన్!

ఆంధ్రా వాళ్ల హోటళ్లు కేటీఆర్‌కి ఎలా వచ్చాయి? రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!

గాంధీ జయంతి వేళ KCR సంచలన కామెంట్స్.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు

బొల్లారం ఆయుధాల చోరీ కేసులో సంచలనం.. బంగ్లాదేశీలకు అమ్మేందుకే ఏకే-47లు, పిస్టళ్లు!

Big Stories

Advertisement
×