Elon Musk Breakup: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోమారు తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం కలిసి జీవిస్తున్న శివోన్ జిలిస్ (Shivon Zilis)కు ఆయన అనూహ్యంగా బ్రేకప్ చెప్పారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ జిలిస్ షాక్ కు గురయ్యారు. ఎలాంటి సంభాషణ లేకుండానే మస్క్ తనతో బంధాన్ని ముగించారని ఎక్స్ వేదికగా ఆందోళన చెందారు. అయితే భవిష్యత్తులో మస్క్ కు అంతా మంచే జరగాలని ఆమె ఆకాంక్షించడం గమనార్హం.
మస్క్ ఎక్స్ (ట్విట్టర్)లో తనను అన్‌ఫాలో చేసిన తర్వాత శివోన్ జిలిస్ భావోద్వేగ నోట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘ఏలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కేవలం ఒకే ఒక్క వారంలో గాఢమైన ప్రేమ నుంచి దూరమయ్యే పరిస్థితి రావడం చాలా కష్టంగా ఉంది. కానీ కొన్నిసార్లు జీవితంలో ఇలాగే జరుగుతుంది’ అని ఆమె ఎక్స్ లో ఆవేదన వ్యక్తం చేశారు.
It’s hard to go from in love to let go in a week with no warning, but that’s just how it is sometimes 🤷🏻♀️
I feel happy that I got to show Elon how it feels to be deeply understood, nurtured, and peacefully loved with stability and gentleness. Given the tumultuous nature of his… https://t.co/HAOfjxrIig pic.twitter.com/lgL0GVzD2R
— Shivon Zilis (@shivon) October 2, 2026
ఈ నోట్‌తో పాటు మస్క్‌తో ఇటీవల జరిగిన చాటింగ్‌కు సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్‌ను కూడా ఆమె షేర్ చేశారు. సెప్టెంబర్ 24న జిల్లీస్ ‘ఈ రోజు ఉదయం మిమ్మల్ని బ్రేక్‌ఫాస్ట్‌లో కలవడం చాలా సంతోషంగా అనిపించింది. లవ్ యు వెరీ మచ్’ అని మెసేజ్ చేయగా.. దానికి మస్క్ ‘లవ్ యు టూ’ అని రిప్లై ఇచ్చారు. అంతేకాకుండా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కోసం వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి జిలిస్ ను కూడా ఆహ్వానించే విషయం తనకు ముందే తెలియలేదని మస్క్ ఆమెకు మెసేజ్ చేశారు. ఈ సంభాషణ జరిగిన కొద్ది రోజులకే సెప్టెంబర్ 27న జిలిస్ ‘కొత్త రోజు, కొత్త జీవితం’ అని ఒక చిన్న పోస్ట్ పెట్టారు.
తన సోషల్ మీడియా నోట్‌లో జిలిస్ ఎంతో బాధతో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. మస్క్ చిన్నతనం చాలా అలజడులతో కూడుకున్నదని, ఆయన నిరంతరం నలిగిపోయారని ఆమె పేర్కొన్నారు. యుద్ధభూమిలాంటి బయటి ప్రపంచం నుంచి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు ప్రశాంతత అందించే సురక్షితమైన ప్రదేశంగా తాను, తమ పిల్లలు నిలిచామని ఆమె వివరించారు.
తన ప్రాణం కంటే ఎక్కువగా మస్క్‌ను ప్రేమించానని ఈ సందర్భంగా శివోన్ జిలిస్ అన్నారు. ‘ఆయన నాకు 100 జన్మలకు సరిపడా జ్ఞానాన్ని నేర్పించారు. నా జీవితానికి పరిపూర్ణమైన అర్థాన్ని ఇచ్చారు’ అని పేర్కొన్నారు. ఈ బ్రేకప్ వల్ల ఎంతో కోల్పోయినట్లు అనిపిస్తున్నప్పటికీ తమ ప్రేమకు గుర్తుగా నలుగురు అందమైన పిల్లలు ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. తన మనసు గాయపడినప్పటికీ.. ఎలాన్ మస్క్ సంతోషం, సంక్షేమాన్ని తాను కోరుకుంటానని అన్నారు. ఇందుకోసం ఎప్పుడూ ప్రార్థిస్తునే ఉంటానని స్పష్టం చేశారు.
Also Read: మెట్రోలో మంత్రుల సందడి.. ప్రయాణికులతో మాటామంతి.. ఆర్టీసీ-మెట్రో పాస్‌పై ఆరా!
2020లో మస్క్ స్పెర్మ్ డోనర్‌గా ఉన్న సమయంలో జిలిస్ ఆయనతో ప్రేమలో పడ్డారు. ఈ జంటకు 2021లో స్ట్రైడర్, అజూర్ అనే కవలలు జన్మించారు. ఆ తర్వాత 2024లో ఆర్కేడియా అనే కుమార్తె, 2025లో సెల్డన్ అనే చిన్న కుమారుడు జన్మించారు. మొత్తంగా నలుగురు వేర్వేరు భాగస్వాములతో ఎలాన్ మస్క్‌కు దాదాపు 14 మంది పిల్లలు ఉన్నారు. మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో మస్క్‌కు ఐదుగురు పిల్లలు ఉన్నారు. వారిలో వివియన్, గ్రిఫిన్ కవలలు కాగా… కై, సాక్సన్, డెమియన్ అనే ముగ్గురు పిల్లలు ఒకేసారి జన్మించారు. అయితే జిల్లీస్‌తో విడిపోవడంపై ఎలాన్ మస్క్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.
Also Read: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. పరిశ్రమ బాయిలర్‌లో భారీ పేలుడు.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి!