BigTV English

SSMB29 Update : శ్రీ కృష్ణుడు ఆయనే – శ్రీ రాముడు కూడా ఆయనే… ఇండస్ట్రీకి కొత్త దేవుడు వచ్చినట్టే..

SSMB29 Update : శ్రీ కృష్ణుడు ఆయనే – శ్రీ రాముడు కూడా ఆయనే… ఇండస్ట్రీకి కొత్త దేవుడు వచ్చినట్టే..

SSMB29 Update : గత కొన్ని రోజులుగా ఇండియాలో ఇతిహాసాలపై తెరకెక్కుతున్న సినిమాలు ట్రెండింగ్ గా మారాయి. ఉదాహరణకు కల్కి (Kalki 2898 AD), హనుమాన్ (Hanuman) సినిమాలు చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి సినిమాలు తెరపైకి వచ్చినప్పుడు ఏ హీరో, ఏ దేవుడి పాత్రలో నటిస్తే బాగుంటుంది అన్న అభిప్రాయానికి మేకర్స్ కంటే ముందే ప్రేక్షకులు వచ్చేస్తారు. అలా ప్రస్తుతం ఇండస్ట్రీలో రాముడిగా, కృష్ణుడిగా ఒకే హీరో పేరు వినిపిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వార్తకి, మహేష్ బాబు (Mahesh Babu) – రాజమౌళి (Rajamouli) కాంబోలో వస్తున్న సినిమా (SSMB29 )కి లింక్ ఏంటో తెలుసుకుందాం పదండి.


సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమా (SSMB29) అప్డేట్స్ కోసం ఆడియన్స్ ఈగరుగా వెయిట్ చేస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. మరోవైపు సినిమాకు తగ్గ ట్రాన్స్ఫర్మేషన్ లోకి రెడీ అవుతూ, దర్శక ధీరుడు పిలుపు కోసం మహేష్ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కథకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త వెలుగులోకి వచ్చింది.

మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో రూపుదిద్దుకుంటున్న సినిమా (SSMB29) కథకి, రామాయణానికి పరోక్షంగా లింక్ ఉందన్నది తాజాగా ఇన్సైడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. సినిమాలో ఓ సందర్భంలో మహేష్ ని రాజమౌళి రాముడి అవతారంలో చూపించబోతున్నారని అంటున్నారు. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాలోని ఓ సన్నివేశంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్ లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ (Ram Charan) అల్లూరి సీతారామరాజు గెటప్ కంటే, ఇప్పుడు మహేష్ బాబు కనిపించబోయే రాముడి సీన్ ద్వారా 1000 రెట్ల వైబ్రేషన్ రాబోతోందని తెలుస్తోంది. అయితే ఈ ‘ఎస్ఎస్ఎంబి 29’ సినిమాలో మహేష్ బాబు రాముడు పాత్రలో నటిస్తారని టాక్ నడుస్తుంటే, మరోవైపు ఆయన మేనల్లుడు అశోక్ గల్లా నటిస్తున్న ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాలో మహేష్ బాబు కృష్ణుడి పాత్రలో నటిస్తారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.


ఇలా మొత్తానికి రెండు సినిమాల్లో రాముడిగా, కృష్ణుడిగా మహేష్ బాబు ఒక్కడే నటిస్తున్నారు అనే టాక్ ఆసక్తికరంగా మారింది. దీంతో మహేష్ (Mahesh Babu) అభిమానులు ఇండస్ట్రీకి కొత్త దేవుడు వచ్చినట్టే అంటూ సంబరపడిపోతున్నారు. కాగా ఈ సినిమా కథ వారణాసి నేపథ్యంలో మొదలవుతుందని ప్రచారం జరుగుతుంది. అనంతరం స్టోరీ సౌత్ ఆఫ్రికాకు షిఫ్ట్ అవుతుందట. ఇక రాజమౌళి వారణాసి షెడ్యూల్ కోసమే హైదరాబాద్ శివార్లలో కాశి సెట్ ను నిర్మిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ సిటింగ్స్ లో బిజీగా ఉండగా, ఇండోనేషియాకు చెందిన ఓ అమ్మాయిని ఇందులో హీరోయిన్ గా తీసుకున్నారని అంటున్నారు. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోందని తెలుస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×