KTR Shocking reaction: బీఆర్ఎస్ ప్లాన్ అట్టర్ ప్లాప్ అవుతోందా? ఏ కాన్సెప్ట్ ఎత్తుకున్నా బూమరాంగ్ అవుతుందా? ప్రభుత్వంపై బురద జల్లాలని భావించి కేటీఆర్ బుక్కయ్యారా? దీన్ని నుంచి బయట పడేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారా? మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసు రాజకీయ రంగు పులుముకుంది. ఈ వ్యవహారంపై అధికార కాంగ్రెస్-విపక్షాల మధ్య మాటల యుద్దం ముదిరిపాకాన పడింది. దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేసిన 10 గంటల్లోపే మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో బీఆర్ఎస్ కీలక నేతల్లో వణుకు మొదలైంది.
వికారాబాద్‌లోని డీటీసీ సెంటర్‌లో పట్నం నరేందర్‌రెడ్డిని ఉంచారు. ఆయనను జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఘటనకు సంబంధించిన డీటేల్స్ దగ్గర పెట్టి విచారణ మొదలుపెట్టారు. విచారణ అనంతరం వైద్యులను పిలిపించి పరీక్షలు చేయనున్నారు. డీటీసీ సెంటర్ నుంచి నేరుగా కోర్టులో హాజరు పరచనున్నారు పోలీసులు.
ఘటన కేసులో జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్ ఉలిక్కిపడింది. పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్‌పై మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్‌ని తీవ్రంగా ఖండించారు. ఆయనను, లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ALSO READ: ఢిల్లీ టూ మహారాష్ట్ర.. ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్!
ఎప్పటిమాదిరిగానే రేవంత్ సర్కార్‌పై బురద జల్లే ప్రయత్నం చేశారు. ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్ట్‌లు ఎన్నో చూసిందన్నారు. ప్రజల తరఫున పోరాటం చేస్తుంటే బీఆర్ఎస్ నేతలను అరెస్ట్‌లతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుందని ఎక్స్‌లో ప్రస్తావించారు.
దాడి కేసులో జరుగుతున్న పరిణామాలను ఆ పార్టీ నేతలు గమనిస్తున్నారు. దీనిపై నోరు ఎత్తితే ఎటు వైపు టర్న్ అవుతుందోనని ఆలోచన చేస్తున్నారు. పోలీసులకు ఆధారాలు లభించిన తర్వాత, నోరు ఎత్తి ఇబ్బందిపడే బదులు సైలెంట్‌గా ఉండడమే మంచిదన్న అభిప్రాయం కొందరి నేతల మాట. మొత్తానికి విచారణలో నరేందర్‌రెడ్డి నోరు విప్పితే అసలు గుట్టు బయటపడుతుందని అంటున్నారు.